వారానికి ఒక్కసారి ఈ టమాటో మాస్క్ వేసుకుంటే జుట్టు రాలమన్న రాలదు!

దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో విరివిగా ఉపయోగించే కూరగాయల్లో టమాటో( Tomato ) ముందు వరుసలో ఉంటుంది.ఆరోగ్యపరంగా టమాటో ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.

 This Tomato Mask Helps To Stop Hair Fall Quickly Details, Tomato Hair Mask, Hai-TeluguStop.com

అలాగే జుట్టు సంరక్షణకు( Hair Care ) కూడా తోడ్పడుతుంది.ముఖ్యంగా వారానికి ఒక్కసారి ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా టమాటో మాస్క్ ను( Tomato Mask ) వేసుకుంటే మీ జుట్టు రాలమన్న రాలదు.

అందుకోసం ముందుగా ఒక టమాటో ని తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి ప్యూరీ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ టమాటో ప్యూరీ లో రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా త‌యారు చేసుకున్న‌ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

Telugu Care, Care Tips, Fall, Healthy, Tomato Benefits, Tomato-Telugu Health

గంట అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.టమాటోలో విటమిన్ ఎ మరియు విట‌మిన్ సి ఉంటాయి, ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.ట‌మాటోలో ఉండే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.ఆలివ్ ఆయిల్‌,( Olive Oil ) తేనె( Honey ) కూడా జుట్టుకు చ‌క్క‌ని పోష‌ణ అందిస్తాయి.

హెయిర్ రూట్స్ ని స్ట్రాంగ్ గా మారుస్తాయి.అందువ‌ల్ల హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నవారు త‌ప్ప‌కుండా ఈ ట‌మాటో మాస్క్ ను ప్ర‌య‌త్నించండి.

Telugu Care, Care Tips, Fall, Healthy, Tomato Benefits, Tomato-Telugu Health

పైగా ట‌మాటో లోని సహజ ఆమ్లత్వం మీ స్కాల్ప్‌లోని పిహెచ్‌ని బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది.చుండ్రు స‌మ‌స్య‌కు స‌మ‌ర్థ‌వంతంగా చెక్ పెడుతుంది.అలాగే ట‌మాటోలోని విట‌మిన్స్ మ‌రియు మిన‌ర‌ల్స్ స్కాల్ప్ కు పోషణనిస్తాయి.ట‌మాటోలోని బ‌యోటిన్ జుట్టును ఒత్తుగా, బ‌లంగా మారుస్తాయి.ట‌మాటోలు సెబమ్ ఉత్పత్తిని నియంత్రించడంలో తోడ్ప‌డ‌తాయి.జిడ్డుగల జుట్టు ఉన్న వారికి పైన చెప్పుకున్న ట‌మాటో మాస్క్‌ మంచి ఎంపిక అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube