ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎలాంటి కష్టాలు లేకుండా లైఫ్ లీడ్ చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగం( Govt Job ) సాధిస్తే మాత్రమే సాధ్యమవుతుందనే సంగతి తెలిసిందే.అయితే ఒక యువకుడు మాత్రం కోచింగ్ కు డబ్బులు లేకపోయినా ఏకంగా 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి వార్తల్లో నిలిచాడు.
తన సక్సెస్ తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.జన్నారం మండలం రోటిగూడకు చెందిన సంతోష్ మంచిర్యాల సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
నిరుపేద కుటుంబంలో జన్మించిన సంతోష్( Santosh ) తల్లీదండ్రుల కష్టాన్ని చూస్తూ పెరిగాడు.ప్రభుత్వ ఉద్యోగ వేటలో కొన్నిసార్లు సంతోష్ కోరుకున్న ఫలితాలు రాలేదు.అయితే నిరాశజనకమైన ఫలితాలు ఎదురైనా మరోసారి ప్రయత్నించి సంతోష్ సక్సెస్ అయ్యారు.గతేడాది రైల్వేలో పాయింట్ మెన్, సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు సాధించిన సంతోష్ ఈ ఏడాది గురుకులాల్లో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలను సాధించాడు.
వరుసగా ఏడు జాబ్స్ సాధించిన సంతోష్ సక్సెస్ స్టోరీ( Santosh Success Story ) నేటి యువతకు ఇన్స్పిరేషన్ అని చెప్పడంలో సందేహం అవసరం లేదు.ఏడు ఉద్యోగాలు సాధించిన సంతోష్ జూనియర్ లెక్చరర్( Jr Lecturer ) ఉద్యోగాన్ని ఎంపిక చేసుకుంటానని చెప్పుకొచ్చారు.ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచిన సంతోష్ సక్సెస్ స్టోరీపై ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
కోచింగ్ తీసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.సంతోష్ ఎంతో కష్టపడటం వల్లే ఈ స్థాయి సక్సెస్ అయితే దక్కిందని కచ్చితంగా చెప్పవచ్చు.సంతోష్ టాలెంట్ ను సైతం నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.
ఎంతో టాలెంట్ ఉన్న సంతోష్ భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదిగి ఎంతోమందికి స్పూర్తిగా నిలిస్తే బాగుంటుందనే కామెంట్లు సైతం సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.