డయాబెటిస్‌ బాధితులు ధూమపానం చేస్తే జరిగే పరిణామాలేమిటో తెలిస్తే...

డయాబెటిస్‌ను దీర్ఘకాలిక వ్యాధి అని అంటారు.ఎందుకంటే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయలేరు.

 If You Know The Consequences Of Diabetes Sufferers Smoking Details, Diabetes, In-TeluguStop.com

అయితే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు.ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేనప్పుడు లేదా ఇన్సులిన్‌ సరిగ్గా వినియోగం కానప్పుడు మధుమేహ సమస్య ఏర్పడుతుంది.ఫలితంగా శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా మధుమేహం సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు.

మధుమేహం సమస్యతో బాధపడుతున్న వారిలో కొందరు ధూమపానం కూడా చేస్తుంటారు.ఇది వారి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిరూపితమయ్యింది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు ధూమపానం చేసినప్పుడు, అది వారి రక్తంలో చక్కెర స్థాయిని మరింతగా పెంచుతుంది.ఇటువంటి పరిస్థితిలో మధుమేహాన్ని నిర్వహించడం చాలా కష్టంగా మారుతుంది.

మీరు డయాబెటిక్ బాధితుడయి ఉండి, పొగ తాగేవారయితే దీని వల్ల మీరు ఎలాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Diabetes, Glucose Levels, Heart Diseases, Insulin, Kidney Diseases, Type

ధమనులు గట్టిపడటం

ధూమపానం కారణంగా, డయాబెటిక్ రోగుల ధమనులు మరింత గట్టిగా మారడం ప్రారంభిస్తాయి.ఫలితంగా వారి సమస్య మరింతగా పెరుగుతుంది.

గుండె సంబంధిత సమస్యలు

మధుమేహం ఉన్నవారు, ధూమపానం చేయడం లేదా పొగాకును తీసుకుంటే వారు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.ఈ అలవాటు గుండెపోటు ముప్పును మరింతగా పెంచుతుంది.

కిడ్నీ సంబంధిత వ్యాధులు

మధుమేహం ఉన్నవారు ధూమపానం చేస్తే కిడ్నీ సంబంధిత వ్యాధులు, కంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.

Telugu Diabetes, Glucose Levels, Heart Diseases, Insulin, Kidney Diseases, Type

అధిక స్థాయి గ్లూకోజ్

మీరు డయాబెటిస్‌తో బాధపడుతూ ధూమపానం చేస్తూ ఉంటే అది శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది లేదా తగ్గిస్తుంది.ఇది మీ ఆరోగ్య పరిస్థితిని మరింత దిగజారుస్తుంది.

అల్బుమినూరియా

అల్బుమినూరియా సమస్య ఉన్నప్పుడు, మూత్రంలో అసాధారణమైన అల్బుమిన్ వెలువడుతుంది.ఇది ఒక రకమైన ప్రోటీన్.

సాధారణంగా అల్బుమిన్ ప్రతి ఒక్కరి మూత్రంలోనూ కనిపిస్తుంది, కానీ మూత్రపిండాల వ్యాధి డయాబెటీస్ కారణంగా మూత్రంలో అల్బుమిన్ పరిమాణం అధిక మొత్తంలో పెరుగుతుంది.ఈ వ్యాధి కారణంగా నరాలు దెబ్బతినే ముప్పు పెరుగుతుంది.అలాగే గాయాలు నయం కావడానికి చాలా సమయం పడుతుంది.

టైప్- 2 డయాబెటీస్

మిగిలిన వారితో పోలిస్తే ధూమపానం చేసే వారిలో టైప్ -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube