వారానికి ఒక్కసారి ఈ టమాటో మాస్క్ వేసుకుంటే జుట్టు రాలమన్న రాలదు!
TeluguStop.com
దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో విరివిగా ఉపయోగించే కూరగాయల్లో టమాటో( Tomato ) ముందు వరుసలో ఉంటుంది.
ఆరోగ్యపరంగా టమాటో ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.అలాగే జుట్టు సంరక్షణకు( Hair Care ) కూడా తోడ్పడుతుంది.
ముఖ్యంగా వారానికి ఒక్కసారి ఇప్పుడు చెప్పబోయే విధంగా టమాటో మాస్క్ ను( Tomato Mask ) వేసుకుంటే మీ జుట్టు రాలమన్న రాలదు.
అందుకోసం ముందుగా ఒక టమాటో ని తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి ప్యూరీ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ టమాటో ప్యూరీ లో రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
"""/" /
గంట అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
టమాటోలో విటమిన్ ఎ మరియు విటమిన్ సి ఉంటాయి, ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
టమాటోలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.ఆలివ్ ఆయిల్,( Olive Oil ) తేనె( Honey ) కూడా జుట్టుకు చక్కని పోషణ అందిస్తాయి.
హెయిర్ రూట్స్ ని స్ట్రాంగ్ గా మారుస్తాయి.అందువల్ల హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ టమాటో మాస్క్ ను ప్రయత్నించండి.
"""/" /
పైగా టమాటో లోని సహజ ఆమ్లత్వం మీ స్కాల్ప్‌లోని పిహెచ్‌ని బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది.
చుండ్రు సమస్యకు సమర్థవంతంగా చెక్ పెడుతుంది.అలాగే టమాటోలోని విటమిన్స్ మరియు మినరల్స్ స్కాల్ప్ కు పోషణనిస్తాయి.
టమాటోలోని బయోటిన్ జుట్టును ఒత్తుగా, బలంగా మారుస్తాయి.టమాటోలు సెబమ్ ఉత్పత్తిని నియంత్రించడంలో తోడ్పడతాయి.
జిడ్డుగల జుట్టు ఉన్న వారికి పైన చెప్పుకున్న టమాటో మాస్క్ మంచి ఎంపిక అవుతుంది.
అమెరికా: ఇంటి భోజనం కోసం పరితపించే భారతీయులకు గుడ్‌న్యూస్.. న్యూయార్క్‌లో అద్భుతమైన సర్వీస్!