ఈ ఏడాది ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏదనే ప్రశ్నకు ఎక్కువమంది పుష్ప ది రూల్( Pushpa The Rule ) పేరు సమాధానంగా వినిపిస్తుంది.పుష్ప ది రూల్ సినిమాలో రష్మిక( Rashmika ) మెయిన్ హీరోయిన్ కాగా ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంది.
అయితే ఆ స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీల( Sreeleela ) పేరును పరిశీలిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బన్నీ, శ్రీలీల కాంబోలో సాంగ్ ఉంటే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.
మరోవైపు ఈ సినిమాలో ఒక సాంగ్ కు కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్( Jani Master ) పేరును పరిశీలించిన సంగతి తెలిసిందే.అయితే జానీ మాస్టర్ ఊహించని విధంగా వివాదంలో చిక్కుకోవడంతో జానీ మాస్టర్ కు బదులుగా ప్రేమ్ రక్షిత్ ను( Prem Rakshit ) తీసుకున్నారని సమాచారం అందుతోంది.
ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్ గా ఊహించని స్థాయిలో సక్సెస్ అయ్యారనే సంగతి తెలిసిందే.
![Telugu Allu Arjun, Alluarjun, Jani Master, Premrakshit, Pushpa, Pushpa Rule, Sre Telugu Allu Arjun, Alluarjun, Jani Master, Premrakshit, Pushpa, Pushpa Rule, Sre](https://telugustop.com/wp-content/uploads/2024/11/pushpa-the-rule-movie-crazy-update-detailsd.jpg)
పుష్ప ది రూల్ సినిమా రిలీజ్ కు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది.రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.పుష్ప2 సినిమాలో పతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుందని సమాచారం అందుతోంది.పుష్ప ది రూల్ సినిమా రష్మిక ఇమేజ్ ను సైతం మార్చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.పుష్ప2 సినిమా ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.
![Telugu Allu Arjun, Alluarjun, Jani Master, Premrakshit, Pushpa, Pushpa Rule, Sre Telugu Allu Arjun, Alluarjun, Jani Master, Premrakshit, Pushpa, Pushpa Rule, Sre](https://telugustop.com/wp-content/uploads/2024/11/pushpa-the-rule-movie-crazy-update-detailsa.jpg)
పుష్ప ది రూల్ సినిమా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.పుష్ప ది రూల్ సినిమా 11500కు పైగా స్రీన్లలో రిలీజ్ కానుంది.ఇన్ని స్క్రీన్లలో సినిమా రిలీజ్ కావడం కూడా రికార్డ్ అనే చెప్పాలి.పుష్ప ది రూల్ సినిమా ఏ రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.