ప్రస్తుత రోజులలో సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.అయితే, తాజాగా యూనివర్సిటీ క్యాంపస్ ( University campus)లో హిజాబ్ వ్యవస్థకు వ్యతిరేకంగా కేవలం లో దుస్తులు ధరించి తిరుగుతూ ఒక యువతి చేసిన నిర్వహణ సోషల్ మీడియాలో చర్చనీయా అంశంగా మారింది.
హిజాబ్ వ్యతిరేకంగా ఒక మహిళా విద్యార్థిని నిరసన వ్యక్తం చేస్తూ యూనివర్సిటీ క్యాంపస్ లో ఇలా తిరుగుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కరలు కొడుతున్నాయి.
సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో అమీర్ – కబీర్ విశ్వవిద్యాలయంలో(Aamir – Kabir University )ఒక మహిళ విద్యార్థినిని హిజాబ్ ధరించమని బలవంతం చేశారు.కానీ, అందుకు ఆమె నిరాకరించింది.దీంతో ఆ మహిళపై ఇరాన్‌లోని ఇస్లామిక (Islamic ,Iran)పాలన పోలీసులు, యూనివర్సిటీ భద్రతా సిబ్బంది దాడికి పాల్పడ్డారు.
చివరకు ఆమె బట్టలు చించేశారు.దీంతో ఆమెకు విసుగు వచ్చి మొత్తం బట్టలన్నీ తొలగించి కేవలం లోదుస్తులతో నిరసన వ్యక్తం చేసింది.
హిజాబ్ కు వ్యతిరేకంగా నిదానాలు చేస్తూ చుట్టుపక్కన మగ విద్యార్థులు ఉన్నా కూడా ఏమాత్రం లెక్కచేయకుండా యూనివర్సిటీ మొత్తం తిరిగింది.ఈ సంఘటన మొత్తం అక్కడ ఉన్న విద్యార్థులు మొబైల్లో చిత్రీకరణ చేసి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
ఈ విషయంలో కాస్త ఇంటెలిజెంట్ సర్వీస్ కు చెందిన సిబ్బంది ఆమెను తీవ్రంగా కొట్టడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగింది.అనంతరం ఆ మహిళను గుర్తు తెలియని వాహనంలో అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయినట్లు సమాచారం.ఇక ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ వివిధ రకాల స్పందిస్తున్నారు.