పాలకూర( Spinach )ఇది ఒక అద్భుతమైన ఆకుకూర అనడంలో సందేహమే లేదు.పాలకూరలో విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఆరోగ్యపరంగా పాలకూర అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది.ఎన్నో జబ్బులకు అడ్డుకట్ట వేస్తుంది.
అయితే చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా పాలకూర ఉపయోగపడుతుందని మీకు తెలుసా.? అవును మీరు విన్నది నిజమే.ముఖ్యంగా మొటిమలు, మచ్చలను మాయం చేసి చర్మాన్ని గ్లోయింగ్ గా మార్చడానికి పాలకూర గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.మరి ఇంతకీ పాలకూరను చర్మానికి ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఐదు నుంచి ఆరు ఫ్రెష్ పాలకూర ఆకులను వేసుకుని రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ), వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E Oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని రెండు నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.ఆపై చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.
పూర్తిగా డ్రై అయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.






 

