ఈ 4 సందర్భాల్లో ఎక్కువ నీరు తాగితే ఎంత ప్రమాదకరమంటే..

నీరు తాగడం అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

 Too Much Of Water Can Also Lead To Certain Health Issues , Health Issues , Wate-TeluguStop.com

నీరు తాగడం శరీరాన్ని నిరంతరం హైడ్రేట్‌గా ఉంచుతుంది.ఫలితంగా రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది.

శరీరం హైడ్రేటెడ్‌గా ఉండడం ఎంతో ముఖ్యం.అయితే మీకు ఏదైనా వ్యాధి ఉంటే మాత్రం నీరు తాగేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి.

కొన్ని సందర్భాల్లో అధికంగా నీరు తాగడం ఆరోగ్యానికి హానికరంగా పరిణమిస్తుంది.ఇంతేకాకుండా నీరు తాగాల్సిన సమయం, పద్ధతులను తెలుసుకోవాలి.ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 ఎక్కువ నీరు తాగవద్దు: నీరు తాగడం చాలా ముఖ్యం.అయితే అధికంగా నీరు తాగడం వలన మూత్రపిండాలు, కాలేయం, గుండె మొదలైన వాటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది, కాబట్టి మీరు నిరంతరం అధికంగా నీరు తాగకూడదని గుర్తుంచుకోండి.

2 మూత్రం నమూనా ప్రయారం నీరు తాగండి: మీ మూత్రం రంగు పూర్తిగా తెల్లగా ఉంటే, మీరు అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగుతున్నారని అర్థం చేసుకోండి.అటువంటి పరిస్థితిలో, మీరు 3 లీటర్ల కంటే ఎక్కువ నీరు తాగకూడదని గ్రహించండి.మూత్రం రంగు లేత పసుపు రంగులో ఉంటే, మీరు సరైన మోతాదులోనే నీరు తాగుతున్నారని గ్రహించండి

Telugu Heart, Hydrate, Kidneys, Liver-Latest News - Telugu

3 ఆహారం తిన్న వెంటనే నీరు తాగకూడదు: సాధారణంగా, ఆహారం తినే అరగంట ముందు నీరు తాగాలి.ఇది ఆకలిని తగ్గిస్తుంది.అతిగా తినడాన్ని నివారిస్తుంది.

తిన్న వెంటనే నీరు తాగడం వల్ల ఆహారం జీర్ణం కావడానికి ఆటంకం ఏర్పడుతుంది.అందుకే ఆహారం తిన్న అరగంట వరకు నీరు తాగవద్దు.

4 వ్యాయామం చేసిన తర్వాత నీరు తాగవద్దు: మీరు చాలాసేపు వ్యాయామం చేస్తే మీకు చెమట పడుతుంది.చెమట కారణంగా శరీరం నుంచి ఎలక్ట్రోలైట్స్ విడుదలవుతాయి.

ఇవి అధికంగా బయటకు పంపడం సరైనది కాదని నిపుణులు చెబుతుంటారు.అటువంటి సందర్భాల్లో నీరు మాత్రమే సరిపోదు.

ఆరోగ్యాన్ని అందించే పండ్ల రసాలను కూడా తీసుకోవాలి.నిమ్మరసం, కొబ్బరి నీరు మొదలైనవి కూడా తీసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube