ఈ మధ్య కాపీ అనే పదం మనకు చాలా కామన్ గా వినిపిస్తుంది.పలు సినిమాల్లో పలు సీన్లు ఆయా భాషల సినిమాల నుంచి కాపీ చేసినవే ఉంటున్నాయి.
సోషల్ మీడియా పుణ్యమా అని ఈ విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి.అంతేకాదు సంగీత దర్శకులు సైతం పలు ఇంగ్లీష్ ఆల్బమ్స్ నుంచి ట్యూన్స్ ఎత్తివేస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి.
భారతీయ సినిమా పరిశ్రమను ఓ రేంజిలో చూపించిన బాహుబలి సినిమాలోని యుద్ధ సన్నివేశాలు సైతం హాలీవుడ్ మూవీస్ నుంచి కాపీ కొట్టినట్లు వార్తలు హల్ చల్ చేశాయి.
వెండి తెరనే కాదు.
బుల్లితెర పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.సాధారణంగా మనం పాత సినిమా టైటిల్స్ ను కొత్త సినిమాలకు పెట్టుకుంటాం.
మల్లీవ్వరి, శంకరాభరణం, మిస్సమ్మ సహా పలు సినిమాల పేర్లు మళ్లీ రిపీట్ అయ్యాయి.కానీ జెమినీ టీవీ, జీ తెలుగు, మా టీవీలో వచ్చే సీరియల్స్ కు సినిమా టైటిల్స్ పెట్టడం విశేషం.
ఈ టీవీ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు.ఇంతకీ ఏ సినిమా టైటిల్.
ఏ టీవీలోని ఏ సీరియల్ కు పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం.
* అదుర్స్ – ఈటీవీ డ్యాన్స్ షో
* ఢీ – ఈటీవీ డ్యాన్స్ షో
* అత్తారింటికి దారేది– ఈ టీవీ సీరియల్
*సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు – ఈ టీవీ సీరియల్
*గోకులంలో సీత – ఈ టీవీ సీరియల్
*వసంతం – సీరియల్

* సావిత్రి – ఈ టీవీ సీరియల్
*స్వాతి చినుకులు – ఈ టీవీ సీరియల్
*జబర్దస్త్ – ఈ టీవీ కామెడీ షో
* అభిషేకం – ఈ టీవీ సీరియల్
*మనసు మమత– సీరియల్
* ఆరాధన – ఈ టీవీ భక్తి కార్యక్రమం

*శుభమస్తు – రాశి ఫలాలు
*క్యాష్ – గేమ్ షో
*ఛాంపియన్ – ఈటీవీ షో
* ఆడదే ఆధారం– ఈ టీవీ సీరియల్
* పవిత్ర – మాటీవీ సీరియల్
ఒకటేమిటీ చాలా సినిమా టైటిల్స్ ను బుల్లి తెర విచ్చల విడిగా వాడుకుంటుంది.