ఎవరెన్ని చెప్పినా.ప్రపంచం ఎన్ని విమర్శలు చేసినా తను పెట్టుకున్న కట్టుబాట్లను, నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేస్తూ వస్తోంది సింగపూర్.
( Singapore ) దేశం అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు అదుపులో ఉండాలని బలంగా నమ్ముతుంది సింగపూర్.అందుకే నేరాలు, శిక్షల అమలు విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ వుంటుంది.
చిన్న నేరం చేసినా.దాని వల్ల సమాజంపై పడే ప్రభావాన్ని బట్టి అక్కడ శిక్షలు వుంటాయి.
ముఖ్యంగా డ్రగ్స్( Drugs ) వినియోగం, రవాణా విషయంలో మాత్రం కఠిన శిక్షలు అమలు చేస్తుంది సింగపూర్.ఏకంగా ఉరిశిక్షను సైతం అమలు చేయడానికి వెనుకాడదు.
రెండేళ్ల క్రితం డ్రగ్స్ స్మగ్లింగ్ కు సంబంధించి నేరం రుజువు కావడంతో భారత సంతతికి చెందిన నాగేంద్రన్ కే ధర్మలింగాన్ని సింగపూర్ ప్రభుత్వం ఉరితీసిన సంగతి తెలిసిందే.ఇది జరిగి రోజులు తిరక్కుండానే 36 ఏళ్ల సింగపూర్ జాతీయుడికి చాంగి జైలు కాంప్లెక్స్‌లో ఉరిశిక్షను అమలు చేసింది.
మార్చి 2022లో ఉరిశిక్షలను తిరిగి ప్రారంభించినప్పటి పలువురు ఖైదీలను ఉరి తీసింది సింగపూర్ ప్రభుత్వం.అయితే ఉరిశిక్షను రద్దు చేయాలని సింగపూర్‌పై అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఒత్తిడి తెస్తోంది.

సింగపూర్‌లో డ్రగ్స్ కేసులో ఉరిశిక్ష పడితే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందేనని అంతా అనుకుంటూ ఉంటారు.అలాంటి ఓ భారత సంతతికి చెందిన వ్యక్తికి తాత్కాలికంగా మరణశిక్ష నుంచి ఉపశమనం లభించింది.భారత సంతతికి చెందిన మలేషియా పౌరుడు పన్నీర్ ప్రాంథమాన్( Pannir Pranthaman ) 51.84 గ్రాముల హెరాయిన్‌ను దిగుమతి చేయడంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.

ఈ కేసులో పోలీసులు అన్ని రకాల ఆధారాలను సమర్పించడంతో పన్నీర్ సెల్వంను దోషిగా తేల్చిన సింగపూర్ కోర్ట్( Singapore Court ) ఉరిశిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది.దీంతో శిక్షను తప్పించుకోవడానికి సింగపూర్ చట్టాల్లో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకున్నప్పటికీ అతనికి ఎక్కడా ఊరట లభించలేదు.ఈ నేపథ్యంలో గురువారం పన్నీరు సెల్వానికి ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉంది.
అయితే ఇటీవల సింగపూర్ ప్రభుత్వం ఉరిశిక్ష పడిన ఖైదీల కోసం తీసుకొచ్చిన కొత్త చట్టం అతనికి ఉపశమనం కలిగించింది.
దీని ప్రకారం దోషి మరణశిక్ష నుంచి తనను తాను రక్షించుకోవడానికి చట్టం కల్పలించిన అప్పీళ్లు అన్నింటినీ వినియోగించుకున్న తర్వాత ఎప్పుడు ఉరి తీయాలనే అంశంపై కొన్ని పద్ధతులను పొందుపరిచారు.దీంతో కొత్త చట్టం ప్రకారం పన్నీరు సెల్వం అప్పీళ్లను విచారించడానికి వీలుగా అతని మరణశిక్షపై స్టే ఇస్తున్నట్లు కోర్టు పేర్కొంది.