ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవడం దాదాపు అందరికీ ఎంతో కష్టతరంగా మారింది.సరైన అవగాహన లేక కొందరు, అవగాహన ఉన్నా బిజీ లైఫ్ స్టైల్ వల్ల మరికొందరు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వహిస్తుంటారు.
ఫలితంగా ఏదో ఒక అనారోగ్య సమస్య వచ్చి ముచ్చెమటలు పట్టిస్తుంది.అయితే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్‌ను వారంలో కనీసం రెండు సార్లు తీసుకుంటే ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు.
వివిధ రకాల జబ్బులు దరి చేరకుండా అడ్డుకోవచ్చు.మరి లేటెందుకు ఆ జ్యూస్ ఏంటో.
ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు బీట్ రూట్ ముక్కలు, అర కప్పు రెడ్ క్యాబేజీ తరుగు, అర కప్పు క్యారెట్ ముక్కలు, అర కప్పు కీర ముక్కలు, పీల్ తొలగించిన ఒక కమలా పండు, అర అంగుళం అల్లం ముక్క, వన్ టేబుల్ స్పూన్ నిమ్మ రసం, మూడు టేబుల్ స్పూన్ల తేనె, హాఫ్ లీటర్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
అంతే హెల్తీ అండ్ టేస్టీ మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రూట్ జ్యూస్ సిద్ధమైనట్లే.

వారంలో రెండు సార్లు ఈ జ్యూస్‌ను తాగితే గనుక రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి గుండె ఆరోగ్య వంతంగా మారుతుంది.శరీరానికి కావాల్సిన ఐరన్ పుష్కలంగా అందుతుంది.దాంతో రక్తహీనత సమస్య దరి దపుల్లోకి రాకుండా ఉంటుంది.
బరువు తగ్గాలనుకునే వారు ఈ జ్యూస్‌ను తరచూ తీసుకుంటే.చాలా మంచిది.
ఎందుకంటే ఈ జ్యూస్‌లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
వాటర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది.కాబట్టి, వేగంగా వెయిట్ లాస్ అవుతారు.
అంతేకాదు, ఈ జ్యూస్ ను డైట్‌లో చేర్చుకోవడం వల్ల లివర్ శుభ్రంగా, ఆరోగ్యంగా మారుతుంది.క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది.చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది.మరియు జుట్టు సంబంధిత సమస్యలు సైతం దూరం అవుతాయి.