టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నిర్మాతలలో ఎస్కేఎన్( Producer SKN ) ఒకరు.ఎస్కేఎన్ నిర్మించిన సినిమాలు తక్కువే అయినా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించడం గమనార్హం.
ఈ మధ్య కాలంలో ఒక ఈవెంట్ లో ఎస్కేఎన్ చేసిన కామెంట్లు ఒకింత హాట్ టాపిక్ అయ్యాయి.ఆ వ్యాఖ్యల గురించి నిర్మాత ఎస్కేఎన్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఎస్కేఎన్ కొంతమంది తాము బెట్టింగ్ యాప్స్( Betting Apps ) లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకున్నామని చెబుతున్నారని తమకు సహాయం చేయాలని వాళ్లు కోరుతున్నారని చెప్పుకొచ్చారు.ఇలాంటి బెట్టింగ్ యాప్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఎస్కేఎన్ సూచనలు చేశారు.
ఈ యాప్స్ డబ్బులు దోచుకోవడానికే క్రియేట్ చేయబడ్డాయని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ బెట్టింగ్ యాప్స్ ట్రాప్ లో అస్సలు పడవద్దని కష్టపడి సంపాదించిన డబ్బులను కోల్పోవద్దని ఎస్కేఎన్ తెలిపారు.ఎస్కేఎన్ పూర్తి పేరు శ్రీనివాస కుమార్ కాగా ఈ నిర్మాత కొత్త ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.బేబీ సినిమాతో( Baby Movie ) ఈ నిర్మాత మంచి లాభాలను సొంతం చేసుకోవడం గమనార్హం.
ఈ మధ్య కాలంలో ప్రముఖ యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు.

బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు తీవ్రస్థాయిలో నష్టపోతున్నారు.సెలబ్రిటీలు సైతం బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.బేబీ నిర్మాత నెటిజన్లకు అవగాహన కల్పించడంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
నిర్మాత ఎస్కేఎన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.భవిష్యత్తులో తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా ఛాన్స్ ఇస్తానని శ్రీనివాస కుమార్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.