ప్రస్తుత రోజులలో సోషల్ మీడియాలో అనేక కధనాలు వైరల్ అవుతూనే ఉన్నాయి.ఈ లిస్ట్ లోకి తాజాగా ఒక వివాహ పత్రిక( Wedding Card ) కూడా చేరింది .
అందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఇటీవలే కామారెడ్డి( Kamareddy ) పట్టణానికి చెందిన నాగేంద్ర బాబుతో( Nagendra Babu ) ఫిబ్రవరి 23న వివాహం నిశ్చయమైన ఓ వధువు, తన పెళ్లి వేడుకను మరపురానిదిగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది.
అందుకు అనుగుణంగా సాంప్రదాయానికి, సృజనాత్మకతకు కలయికగా ఒక విశేషమైన 36 పేజీల పెళ్లి పత్రికను ముద్రించి, తన బంధుమిత్రులను ఆహ్వానించడానికి వినూత్న మార్గాన్ని ఎంచుకుంది.

సాధారణంగా పెళ్లి కార్డులు ఒకే స్టాండర్డ్ ఫార్మాట్ లో ఉంటాయి.కానీ కుటుంబం ఆచారం, ఆవిష్కరణ కలయికగా పెళ్లి ఆహ్వానాన్ని పుస్తకం రూపంలో ముద్రించింది.ఈ ప్రత్యేక పుస్తకంలో వివాహ సంస్కృతి, సంప్రదాయ మంత్రాలు, వివాహ శుద్ధి తంతులు మొదలైన వివాహ విశేషాలను అందంగా ప్రతిబింబించారు.36 తంతులతో వివాహ విశిష్టత. ఈ వివాహ పుస్తకంలో పెళ్లి కర్మకాండలో జరిగే ప్రధాన 36 తంతులను ఒక్కొక్క పేజీలో వివరించారు.
అందులో ముఖ్యంగా పెళ్లిచూపులు, పాణిగ్రహణ శుభ ముహూర్త పత్రిక, వరపూజ, వధువును గంపలో తీసుకురావడం, తెరసాల, కన్యాదానం, మాంగల్య పూజ, జిలకరబెల్లం, తలంబ్రాలు, సప్తపది, బ్రహ్మముడి, ఉంగరాలు తీయించుట, అప్పగింతల పాట ఇలా చాల విషయాలను తెలిపారు.ఈ పుస్తకాన్ని స్వయంగా వధువు తరుపున బంధువులు పంపిణీ చేస్తున్నారు.

వధువు తన వివాహాన్ని ఇలా సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవడాన్ని గర్వంగా భావిస్తోంది.పెళ్లి పత్రికే ఈ రీతిగా వినూత్నంగా ఉంటే, అసలు వివాహ వేడుక ఎంత వైభవంగా ఉంటుందోనని బంధుమిత్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ ప్రత్యేక పెళ్లి ఆహ్వానం అందరిలోనూ ఒక చర్చనీయాంశంగా మారింది.ఈ పత్రికను చుసిన వారు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు.