పొడవాటి జుట్టు కోరుకోని వారుండరు.పొడవాటి జుట్టు అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది.
అందుకే జుట్టును పొడవుగా పెంచుకోవాలని చూస్తుంటారు.కానీ, కొందరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా జుట్టు పెరగదు.
అయితే పొడవు జుట్టును షార్ట్ చేసుకోవడం సులువే.కానీ, పొట్టి జుట్టును పొడవుగా మార్చుకోవడం కాస్త కష్టం.
అయితే కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే పొడవాటి జుట్టును పొందొచ్చు.ముఖ్యంగా బంగాళాదుంప జుట్టును పొడవుగా మార్చడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది.
మరి బంగాళాదుంపను హెయిర్‌కు ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా బంగాళాదుంప తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి రసం తీసుకోవాలి.
ఈ రసంలో ఉల్లి రసం కలిపి తలకు, కేశాలకు, కుదుళ్లకు అప్లై చేయాలి.అర గంట తర్వాత గోరు వెచ్చిన నీటితో తలస్నానం చేయాలి.
ఇలా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు పొడవుగా పెరుగుతుంది.
అలాగే ఒక బౌల్‌లో బంగాళాదుంప రసం వేసి అందులో కొద్దిగా కలబంద గుజ్జు వేసి కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అర గంట నుంచి గంట పాటు ఆరనివ్వాలి.ఆ తర్వాత సాధారణ ష్యాంపూతో హెడ్ బాత్ చేయాలి.
ఇలా మూడు రోజులకు ఒకసారి చేస్తే జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు చుండ్రు సమస్య కూడా దూరం అవుతుంది.
ఇక బంగాళాదుంప తీసుకుని మెత్తగా నూరి రసం తీసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్‌లో బంగాళాదుంప రసం, నిమ్మ రసం మరియు కొబ్బరి నూనె వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని తలకు, కేశాలకు, జుట్టు చివర్లకు అప్లై చేసి కాసేపు వదిలేయాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.ఇలా తరచూ చేసినా హెయిర్ ఫాల్ తగ్గుతుంది.
మరియు జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.