ఈ 5 ర‌కాల‌ నట్స్ డైట్ లో ఉంటే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదు!

These 5 Types Of Nuts Very Good For Health! Nuts, Health, Health Tips, Walnut , Good Health, Latest News, Walnuts, Almonds, Cashew Nuts, Pista, Brazil Nuts

నట్స్.వీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

నట్స్ ఖరీదు కాస్త ఎక్కువే అయినప్పటికీ అనేక పోషకాలు కలిగి ఉంటాయి.అందుకే అవి ఆరోగ్యపరంగా బోలెడు ప్రయోజనాలను చేకూరుస్తాయి.

అయితే నట్స్ లో ఎన్నో రకాలు ఉన్నాయి.వాటిలో ఏవి తింటే మంచిది.

ఏవి ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తాయి అన్న విషయం పై చాలా మందికి పెద్దగా అవగాహన ఉండదు.దాంతో ఏవి తినాలో తెలియక సతమతం అవుతుంటారు.

వర్రీ వద్దు ఇప్పుడు చెప్పబోయే ఐదు రకాల నట్స్ ను డైట్ లో చేర్చుకుంటే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఐదు రకాల నట్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

జీడిపప్పు.చాలా మంది ఫేవరెట్ నట్ ఇది.చక్కటి రుచితో పాటు జీడిపప్పులో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.రోజుకు 5 నుంచి 6 జీడిపప్పులు తీసుకుంటే నిద్రలేమి దూరం అవుతుంది.

చక్కటి నిద్ర పడుతుంది.గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

రక్తపోటు అదుపులో ఉంటుంది.

Telugu Almonds, Brazil Nuts, Cashew Nuts, Tips, Latest, Nuts, Pista, Walnuts-Tel

బాదం.అద్భుతమైన నట్స్ లో ఇది ఒకటి.రోజుకు 10 బాదం పప్పులు తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు.

శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్ లభిస్తుంది.వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.

స్ట్రెస్, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను నివారించడానికి కూడా బాదం గ్రేట్ గా సహాయపడుతుంది.

పిస్తా.

వీటి ఖరీదు ఎక్కువే అయినప్పటికీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా సంతాన లేమి సమస్యతో బాధపడుతున్న దంపతులు కచ్చితంగా పిస్తా పప్పును తమ డైట్ లో చేర్చుకోవాలి.

రెగ్యులర్ గా పిస్తా పప్పు( Pista ) తీసుకుంటే స్త్రీ పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.స్త్రీలలో అండాశయ, గర్భాశయ సమస్యలు ఉంటే తగ్గుముఖం పడతాయి.

పురుషుల్లో లైంగిక సామర్థ్యం రెట్టింపు అవుతుంది.

Telugu Almonds, Brazil Nuts, Cashew Nuts, Tips, Latest, Nuts, Pista, Walnuts-Tel

వాల్ నట్స్( Walnuts ).ఇవి మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.రోజుకు నాలుగు వాల్ నట్స్ తింటే మీ మెదడు మునుపటి కంటే వేగంగా పనిచేస్తుంది.

జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి రెట్టింపు అవుతాయి.అల్జీమర్స్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.

కంటి చూపు పెరుగుతుంది.రక్తహీనత దూరం అవుతుంది.

జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.చర్మం యవ్వనంగా మెరుస్తుంది.

Telugu Almonds, Brazil Nuts, Cashew Nuts, Tips, Latest, Nuts, Pista, Walnuts-Tel

బ్రెజిల్ నట్స్.థైరాయిడ్ ఉన్నవారికి ఇవి చాలా మేలు చేస్తాయి.రోజుకు మూడు లేదా నాలుగు బ్రెజిల్ నట్స్( Brazil nut ) ను తీసుకుంటే థైరాయిడ్ హెల్త్ మెరుగుపడుతుంది.క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది.ఎముకలు దృఢంగా తయారవుతాయి.

బ్లడ్ షుగర్ లెవెల్స్ సైతం కంట్రోల్ లో ఉంటాయి.కాబట్టి హెల్తీగా ఫిట్ గా ఉండాలని భావించేవారు తప్పకుండా ఈ ఐదు రకాల నట్స్ ను డైట్ లో చేర్చుకోండి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube