నెలలో ఆ రోజులు దగ్గరకు వచ్చినప్పుడు మహిళలు బోర్ మరియు టెన్షన్ గా ఉంటారు.మనసులో గందరగోల వాతావరణం బహిష్టు రోజులను గడుపుతుండడం ఒక అగ్ని పరీక్షలా ఉంటుంది.
పొత్తికడుపులో నొప్పి, అలసట, కళ్లు తిరగడం, కాళ్ళ కండరాల నొప్పులు, కూర్చోలేకపోవడం, నిలబడలేక పోవడం ప్యాడ్‌లను తరచూ మార్చుకోవడంలో ఇబ్బందిగా ఉండడం, రక్తస్రావంతో పాటు ఇతర లక్షణాలు కూడా ఉంటాయి.ప్రతినెల ఋతుక్రమం ఆరోగ్యానికి సంకేతం.
ఆరోగ్యకరమైన మహిళ యొక్క ఋతు చక్రం( Menstruation Cycle ) 28 రోజులు మరియు సాధారణంగా మూడు నుంచి ఐదు రోజులు ఉంటుంది.

ఇటువంటి కాలంలో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఆడపిల్లల రుతుక్రమం సక్రమంగా రాకుండా ఉంది.రుతుక్రమంలో హెచ్చుతగ్గులు( Hormonal fluctuations ) అధిక రక్తస్రావం లేదా రక్తస్రావం లేకపోవడం కూడా వ్యాధి లక్షణాలు.చాలా మందికి కడుపునొప్పి, విపరీతమైన కోపం లేదా డిప్రెషన్, తలనొప్పి మరికొందరు కాళ్ల తిమ్మిర్లు వంటి లక్షణాలను అనుభవిస్తూ ఉంటారు.
రుతుస్రావం సమయంలో వచ్చే బాధాకరమైన దుస్సంకోచాలను డైసేనోరియా అంటారు.గర్భాశయం కుంచించుకుపోవడం వల్ల పొత్తి కడుపులో ఒత్తిడి, వెన్ను నొప్పితో పాటు కడుపునొప్పి వంటి అనుభూతి కలుగుతుంది.

అమెనోరియా ఇది సక్రమంగా లేని రుతుచక్రం సమస్య మరియు హెచ్చుతగ్గులు వరుసగా మూడు కాలాలు సంభవిస్తే అది అమెనోరియా యొక్క లక్షణం.ముఖ్యంగా చెప్పాలంటే సహజమైన ఆహారాన్ని తినడం ఎంతో అవసరం.చాలా స్పైసీ మరియు ఆయిల్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.ఎక్కువగా పండ్లు మరియు కూరగాయలు తింటూ ఉండాలి.జీలకర్ర ఉడికించిన నీటిని తాగడం వల్ల నొప్పి తగ్గుతుంది.అల్లం( Ginger ) సహజ నొప్పి నివారిణి అందువల్ల దీన్ని ఆహారంలో ఉపయోగించడం ఎంతో మంచిది.
బొప్పాయి పండు( Papaya )ను తీసుకోవడం వల్ల సకాలంలో రుతుక్రమం వస్తుంది.బహిష్టు సమయంలో డిహైడ్రేషన్ ఏర్పడుతుంది.
కాబట్టి నీరు, జ్యూస్ ఎక్కువగా తాగుతూ ఉండాలి.చల్లని నీటి స్నానాలు హార్మోన్లను సమతుల్యం చేయడానికి మరియు రుతుక్రమ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.