పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా నటిస్తున్నటువంటి సినిమాలలో హరిహర వీరమల్లు ( Hari Hara Veerumallu ) సినిమా ఒకటి.పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే మొదటి భాగం దాదాపు షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.ఈ సినిమా మార్చ్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల చేయడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.దర్శకులు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియాడిక్ పాన్ ఇండియా సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక వారియర్ గా కనిపించబోతున్నారు పవన్ కళ్యాణ్ సినీ కెరియర్లు మొదటిసారి ఇలాంటి పాత్రలో ఈయన నటిస్తున్నారు.నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.ఇక పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలలో బిజీ అయిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుంది.అయితే ఇటీవల కాలంలో పవన్ తనకు వీలైనప్పుడల్లా ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి కొల్లగొట్టినాదిరో( Kollagottinadhiro Song ) అని సెకండ్ సింగిల్ ను విడుదల చేశారు.ఈ పాటలో అనసూయ( Anasuya ) క్లిప్ కనిపించడం, పవన్ కళ్యాణ్ తనదైన మ్యానరిజంతో అట్రాక్ట్ చేయడంతో క్షణాల్లోనే వైరల్ అయింది.ఇలా అనసూయ పవన్ కళ్యాణ్ పక్కన కనిపించడంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది.ఈ సినిమాలో తన పాత్ర అద్భుతంగా ఉంటుందని గతంలో అనసూయ కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో నిధి అగర్వాల్( Nidhi Aggarwal ) ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.