ప్రభుదేవా కన్సర్ట్.. కనీస గౌరవం దక్కలేదు.. సృష్టి డాంగే సంచలన వ్యాఖ్యలు వైరల్!

ప్రముఖ నటి సృష్టి డాంగే( Srushti Dange ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ నటి ప్రభుదేవా( Prabhudeva ) నాట్య కచేరిలో తనకు సరైన గౌరవం దక్కలేదని సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

 Srushti Dange Sensational Comments About Prabhudeva Concert Details, Srushti Dan-TeluguStop.com

ఆ వివక్షను భరించలేక లైవ్ షోకు రావాలనుకున్న ఆలోచనను విరమించుకున్నానని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ను షేర్ చేస్తూ సృష్టి డాంగే ఈ కామెంట్లు చేశారు.

ప్రభుదేవా లైవ్ షోకు నేను వస్తానని ఎదురుచూసిన వాళ్లందరికీ ఒక విషయం చెప్పాలని ఆమె అన్నారు.ఆ షోకు నేను రావడం లేదని తెలియజేయడానికి చింతిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

ఈ నిర్ణయానికి ప్రభుదేవా సార్ కు ఎలాంటి సంబంధం లేదని సృష్టి డాంగే అభిప్రాయం వ్యక్తం చేశారు.

Telugu Actresssrushti, Prabhudeva, Srushti Dange, Srushtidange-Movie

ఇప్పటికీ ఎప్పటికీ నేను ప్రభుదేవా సార్ కు అభిమానినే అని ఆమె తెలిపారు.కాకపోతే ఆ షో నిర్వాహకులు చూపించే వివక్షను మాత్రం నేను భరించలేనని సృష్టి డాంగే వెల్లడించారు.నేను ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నానని అయినప్పటికీ నాకు దక్కాల్సిన వాటి కోసం నేను ఇప్పటికీ పోరాడుతున్నానని ఆమె తెలిపారు.

ఇచ్చిన మాటపై నిలబడకపోవడం, అబద్ధపు హామీలు ఇవ్వడం నిజంగా విచారకరం అని సృష్టి డాంగే అన్నారు.

Telugu Actresssrushti, Prabhudeva, Srushti Dange, Srushtidange-Movie

ఆ రీజన్ వల్లే నేను కన్సర్ట్ కు( Concert ) రాకూడదని ఫిక్స్ అయ్యానని ఆమె తెలిపారు.నేను మీ అందరినీ క్షమించమని అడగడం లేదని ఎందుకు షోకు హాజరు కావడం లేదో కారణం చెప్పాలని అనుకుంటున్నానని ఆమె వెల్లడించారు.మరోసారి మంచి వాతావరణంలో సముచిత గౌరవం దక్కే ప్రదేశంలో మిమ్మల్ని కలుస్తానని సృష్టి డాంగే అన్నారు.

తెలుగులో పలు చిన్న సినిమాల్లో ఈ నటి మెరిశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube