కెరీర్ తొలినాళ్లలో భద్ర, తులసి, సింహా సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న బోయపాటి శ్రీను( Boyapati Srinu ) తర్వాత రోజుల్లో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు.అయితే బాలయ్య( Balayya ) బోయపాటి శ్రీను కాంబినేషన్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా అంచనాలకు మించి విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.
బోయపాటి శ్రీను గత సినిమా స్కంద బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేదనే సంగతి తెలిసిందే.
రామ్ డ్యూయల్ రోల్ లో ఈ సినిమాలో నటించగా ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల విషయంలో కథ, కథనం విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.ఒక షాట్ లో రామ్ కు బదులుగా బోయపాటి శ్రీను కనిపించడాన్ని కూడా నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు.

అయితే అఖండ సీక్వెల్ కు ( Akhanda 2 ) బోయపాటి శ్రీను రెమ్యునరేషన్( Boyapati Srinu Remuneration ) 35 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో 35 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు చాలా తక్కువమంది ఉన్నారు.అఖండ సీక్వెల్ బడ్జెట్ దాదాపుగా 200 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.అఖండ సీక్వెల్ నాన్ థియేట్రికల్ హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొంది.

అఖండ సీక్వెల్ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో థియేటర్లలో విడుదల కానుంది.బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.బాలయ్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
బోయపాటి శ్రీను బన్నీ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.