తమ జుట్టు సిల్కీగా మరియు స్ట్రాంగ్ గా( Silky Strong Hair ) ఉండాలని చాలా మంది కోరుకుంటారు.అటువంటి జుట్టును పొందడం కోసం ఖరీదైన కేశ ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు.
అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరం చాలా బాగా సహాయపడుతుంది.ఈ సీరంతో సిల్కీ అండ్ స్ట్రాంగ్ హెయిర్ ను మీ సొంత చేసుకోవచ్చు.

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.వాటర్ బాయిల్ అయ్యాక నాలుగు మందారం పువ్వులు,( Hibiscus ) ముక్కలుగా కట్ చేసిన రెండు మందారం ఆకులు, అర కప్పు కలబంద ముక్కలు( Aloevera ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax Seeds ) వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
గోరువెచ్చగా అయ్యాక ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తే మన సీరం అనేది రెడీ అవుతుంది.

ఈ న్యాచురల్ సీరంను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఈ సీరం ను కనుక వాడితే మంచి ప్రయోజనాలు పొందుతారు.
ఈ సీరం జుట్టును హైడ్రేట్ చేస్తుంది.డ్రై హెయిర్ కు చెక్ పెట్టి కురులను సిల్కీ గా మారుస్తుంది.
అలాగే ఈ సీరం జుట్టును మూలాల నుంచి బలోపేతం చేస్తుంది.హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేస్తుంది.
హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది.ఫైనల్ గా ఈ సీరంతో సిల్కీ అండ్ స్ట్రాంగ్ హెయిర్ మీసొంతం అవుతుంది.