అధిక బరువు.ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మందికి కామన్ శత్రువుగా మారింది.అధిక బరువుకు కారణాలు అనేకం.అయితే తగ్గడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి.చాలా మంది బరువు తగ్గడం కోసం కఠినమైన డైట్ ను ఫాలో అవుతుంటారు.రెగ్యులర్ గా వ్యాయామాలు చేస్తుంటారు.
అయితే కొందరికి వ్యాయామాలు చేసేంత టైం ఉండకపోవచ్చు.ఇలాంటి వారు బరువు తగ్గడం ఎలానో తెలియక తీవ్రంగా మదన పడిపోతూ ఉంటారు.
ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే ఇకపై వర్రీ వద్దు.
ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను తీసుకుంటే వ్యాయామాలు చేయకుండానే బరువు తగ్గొచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక గ్లాస్ హాట్ వాటర్ ను తీసుకోవాలి.ఈ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేసుకోవాలి.
అలాగే పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేయాలి.చివరగా వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.
తద్వారా మన డ్రింక్ సిద్ధమవుతుంది.ఇందులో కావాలి అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ తేనె లేదా వన్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము యాడ్ చేసుకోవచ్చు.ఉదయం ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ ను సేవించాలి.ప్రతి రోజు ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే మెటబాలిజం రేటు అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.దీంతో క్యాలరీలు కరిగే వేగం పెరుగుతుంది.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.
ఒక ఫ్యాట్ కట్టర్ డ్రింక్ గా కూడా ఇది పనిచేస్తుంది. బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడేవారు ఈ డ్రింక్ ను తీసుకుంటే కేవలం కొద్ది రోజుల్లోనే బాన పొట్ట నాజూగ్గా మారుతుంది.అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి ఇది బెస్ట్ డ్రింక్ అని చెప్పుకోవచ్చు.ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టం సైతం బూస్ట్ అవుతుంది.
తద్వారా సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.