మల్చింగ్ టెక్నాలజీతో మిరపసాగు భలే.. శ్రమ తక్కువ.. రాబడి ఎక్కువ..!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో పండించే పంటలలో ఒకటి ఈ మిరప పంట.ఇక ఎరువులను, నీటిని నేరుగా మిరప మొక్క వేరుకు అందిస్తే మంచి రాబడి రావడమే కాక శ్రమ, నీరు చాలా తక్కువ అవసరం అవుతుంది.

 Chili Cultivation Is Better With Mulching Technology Less Labor More Income , Ch-TeluguStop.com

మల్చింగ్ టెక్నాలజీ తో మిరప పంట సాగు చేస్తే నాణ్యమైన మిరప పంటను తక్కువ పెట్టుబడి తోనే మంచి దిగుబడి సాధించవచ్చు.ఈ మల్చింగ్ టెక్నాలజీ ద్వారా మొక్క చుట్టూ ఉండే తేమ ఆవిరి కాకుండా దాదాపు 50% నీరు ఆదా చేయవచ్చు.

ఇలా చేస్తే కలుపు మొక్కలు కూడా దాదాపు 70 శాతం వరకు నివారించవచ్చు.

Telugu Agriculture, Andhra Pradesh, Chili, Chilli Crop, Insects, Latest Telugu,

మిరప పంటకు పురుగుల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది.ఈ మల్చింగ్ టెక్నాలజీతో పురుగులు మొక్కల రసం పీల్చుకోకుండా కాపాడుకోవచ్చు.ఇక సాంప్రదాయ పద్ధతిలో కాకుండా డ్రిప్ పద్ధతి ద్వారా ఎరువులను నేరుగా వేరు వ్యవస్థకు అందిస్తే భూమి కోతకు గురయ్యే అవకాశం చాలా తక్కువ.

ఇంకా భూమిలోని క్రిమి కీటకాలు, తెగుళ్లు మొక్కకు చేరకుండా ఈ మల్చింగ్ షీట్ రక్షణ కల్పిస్తుంది.ఇక మార్కెట్లో రకరకాల మల్చింగ్ షీట్ దొరుకుతాయి మిరప పంటకు 25 మైక్రాన్ల మందం ఉన్న మల్చింగ్ షీట్ సరిపోతుంది.

ఇక కొన్ని కంపెనీలు మల్చింగ్ షీట్ పేపర్లకు రంద్రాలు వేసి అందుబాటులోకి తెచ్చాయి.ఇవి మిరప సాగుకు బాగా ఉపయోగపడతాయి.ఇక 3200-3500 చదరపు మీటర్ల షీట్ ఒక ఎకరా పంటకు అవసరం.

Telugu Agriculture, Andhra Pradesh, Chili, Chilli Crop, Insects, Latest Telugu,

ప్రస్తుతం వ్యవసాయ క్షేత్రంలో కూలీల కొరత ఎక్కువగా ఉంది.పైగా వ్యవసాయానికి పెట్టుబడి కూడా చాలా ఎక్కువ అవుతుండడంతో ఈ మల్చింగ్ షీట్ టెక్నాలజీతో క్రిమిసంహారక మందుల ఖర్చు దాదాపుగా తగ్గుతుంది.దాదాపుగా ఈ పద్ధతిలో కలుపు మొక్కలు కూడా చాలావరకు వచ్చే అవకాశం లేనందున కూలీల ఖర్చు కూడా దాదాపుగా మిగిలినట్టే.

ఈ మల్చింగ్ టెక్నాలజీ తో వ్యవసాయంలో తక్కువ శ్రమ పెట్టి తక్కువ ఖర్చుతో అధిక రాబడి పొంది మంచి ఆదాయం అర్జించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube