మన దేశంలో ఒకేరోజు మూడు హెచ్ఎంపీవీ కేసులు( HmPV cases ) నమోదు కావడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజల్లో ఒకింత టెన్షన్ నెలకొంది.అయితే శాస్త్రవేత్తలు, వైద్యులు మాత్రం ఈ వైరస్ కరోనా లాంటి వైరస్ కాదని చెబుతున్నారు.ఈ వైరస్ మహమ్మారి అయ్యే అవకాశాలు అయితే లేవని వెల్లడిస్తున్నారు.2001 సంవత్సరంలోనే శాస్త్రవేత్తలు ఈ వైరస్ ను గుర్తించారట.
ఈ వ్యాధి లక్షణాలు శరీరంలో మూడు నుంచి ఐదు రోజులు ఉంటాయని ఈ వైరస్ ప్రధానంగా ఇమ్యూనిటీ పవర్ ( Immunity power )ను దెబ్బ తీస్తుందని వైద్యులు చెబుతున్నారు.2023 సంవత్సరంలో పలు దేశాల్లో ఈ వైరస్ కు సంబంధించిన కేసులు నమోదయ్యాయని సమాచారం.తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ దానంతట అదే తగ్గుముఖం పడుతుందని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి దినేష్ గుండూరావు( Health Minister Dinesh Gundurao ) చెప్పుకొచ్చారు.

మరోవైపు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.మన దేశవ్యాప్తంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను ( Respiratory infections )ట్రాక్ చేసేలా సంబంధిత శాఖలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.ఇప్పటివరకు ఈ వ్యాధి సోకిన వాళ్లకు నిర్ధిష్టమైన యాంటీ వైరల్ చికిత్స లేదు.
అయితే నొప్పి నివారణ మందులు, ఆక్సిజన్ థెరపీ చేపట్టడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని తెలుస్తోంది.

ఈ వైరస్ కొన్ని సందర్భాల్లో మాత్రం న్యూమోనియా, బ్రాంకైటిస్ లాంటి సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది.రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటంతో పాటు తగినంత నిద్ర ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది.ఈ వైరస్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉండబోతుందో చూడాల్సి ఉంది.
ఈ వైరస్ వ్యాప్తి జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు చేపట్టాల్సి ఉంది.