బైకర్ తాటతీసిన క్యాబ్ డ్రైవర్.. షాకింగ్ వీడియో వైరల్..

డ్రైవింగ్‌కు సెల్ఫ్ కంట్రోల్, ఫోకస్ చాలా అవసరం, ఎందుకంటే చిన్న డిస్ట్రాక్షన్ పెద్ద ప్రమాదానికి కారణమవుతుంది.అయినప్పటికీ, రోడ్లపై ఉండే విపరీతమైన ట్రాఫిక్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండటం కష్టతరం చేస్తుంది.

 Cab Driver Slapped By Biker Shocking Video Goes Viral , Road Rage, Cab Driver, B-TeluguStop.com

కొన్నిసార్లు డ్రైవర్లు( Drivers ) అనుకోకుండా ఇతరులకు హాని కలిగించవచ్చు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు ప్రమాదవశాత్తు ఇతర వాహనాలకు ఢీ కొట్టవచ్చు.కొన్నిసార్లు టూవీలర్లు ఇతర వాహనదారులతో దురుసుగా ప్రవర్తించవచ్చు.

తెలంగాణకు చెందిన ఒక వీడియో ఇలాంటి ఒక ఘటనను చూపుతోంది.ఈ వీడియో ప్రకారం ఒక క్యాబ్ డ్రైవర్, బైకర్ హింసాత్మక ఘర్షణకు దిగారు.“రోడ్ రేజ్.దీనిపై మీ అభిప్రాయం ఏంటి ? లొకేషన్ – తెలంగాణ” అనే క్యాప్షన్‌తో ఫేస్‌బుక్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు.ఫైట్‌కు ముందు, తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూపించారు.మొదట, బైకర్‌ ఇరుకైన ప్రదేశంలో క్యాబ్ డ్రైవర్ ను ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ ఓవర్‌టేక్‌కు క్యాబ్ డ్రైవర్ సందు ఇవ్వలేదు.

అసలు అక్కడ సైడ్ ఇవ్వడానికి కూడా వీల్లేదు.దాంతో బైకర్ ( Biker )తన బ్యాలెన్స్ కోల్పోయి మరొక వాహనాన్ని దాదాపుగా ఢీకొట్టాడు.

ఆ తర్వాత బైకర్‌కు కోపం వచ్చి క్యాబ్‌ వెనుక భాగాన్ని చేత్తో కొట్టడంతో క్యాబ్‌ డ్రైవర్‌కు కోపం వచ్చింది.క్యాబ్ డ్రైవర్( Cab driver ) తన కారును ఆపి, డిక్కీలోని కర్ర తీసుకుని, బైక్ ముందు భాగంలో కొట్టడం ప్రారంభించాడు.బైక్ తాళాలు కూడా తీసుకుని బైకర్‌ని పలుమార్లు చెంప మీద కొట్టాడు.ఈ వీడియో వైరల్‌గా మారింది.10 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ సాధించింది.చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు క్యాబ్ డ్రైవర్ చర్యలను సమర్థిస్తున్నారు, అతను బైకర్‌కు మంచి గుణపాఠం చెప్పాడని చెప్పారు.

మరో వీడియోలో ఇద్దరు కార్ డ్రైవర్లు డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్లలా పోరాడుతూ కనిపించారు.వారి గొడవకు కారణం స్పష్టంగా తెలియలేదు, అయితే వారు ఒకరినొకరు తోసుకోవడం, కొట్టుకోవడం, ఒకరి బట్టలు చింపుకోవడం జరిగింది.

ఈ వీడియో ట్విటర్‌లో షేర్ చేయబడింది.దీనికి లక్షల వ్యూస్ వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube