తాజాగా కొందరు ఖలిస్తానీలు( Khalistanis ) బ్రాంప్టన్ లోని( Brampton ) హిందూ సభా మందిర్ లోని( Hindu Sabha Temple ) భక్తులపై దాడికి పాల్పడ్డారు.ఈ సంఘటనపై కెనడా ప్రధాని అయిన జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) తీవ్రంగా ఖండించారు.
దేశంలో హింసాత్మక చర్యలు ఆమోదయోగ్యం కాదన్నారు.ప్రతి కెనడియన్‌కు వారి విశ్వాసాన్ని స్వేచ్ఛగా సురక్షితంగా ఆచరించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు.
ఇక సంఘటనపై దర్యాప్తు చేయడానికి వెంటనే స్పందించిన పోలీసు అధికారులకు ప్రధాని జస్టిన్ ట్రూడో ధన్యవాదాలు కూడా తెలియజేశారు.

అయితే, ప్రస్తుతం సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొట్టడంతో పాటు కనెడియన్ ఎంపీలతో సహా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు.వైరల్ అవుతున్న వీడియో( Viral Video ) ఆధారంగా ఆలయం వెలుపల ఖలిస్థానీ అనుకూల గ్రూపులతో సంబంధం ఉన్న జెండాలను ప్రదర్శించడంతోపాటు కర్రలతో చిన్నారులు, మహిళలపై దాడి చేస్తున్నట్లు మనం చూడవచ్చు.సంఘటన తెలుసుకున్న వెంటనే కెనడియన్ పోలీస్ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వారిని రక్షించారు.

పీల్ ప్రాంతీయ పోలీసు చీఫ్ నిషాన్ దురైయప్ప అందరూ సమన్వయం పాటించాలని కోరాడు.అలాగే శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, హింస నేరపూరిత చర్యలు వారు సహించారని ఇలాంటి ఆసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కెనడా పోలీస్ అధికారులు తెలియజేశారు.ఇక ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజెన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.హిందూ దేవాలయాలపై ఇలా దాడులకు ఎప్పుడు ముగింపు పలుకుతుందో అని కామెంట్ చేస్తున్నారు.







