సాధారణంగా మనలో పాములంటే చాలామందికి చాలా భయం.అక్కడెక్కడో పాము ఉందంటే చాలు ప్రాణ భయంతో భయపడతూ అక్కడి నుంచి పరుగులు తీస్తూ ఉంటారు కొంత మంది.
అయితే, మరి కొంతమంది పాములతో ( Snakes ) స్నేహంగా ఉంటూ వారితోపాటు భారీగా పాములను, కొండచిలువలను పెంచుకుంటూ అంటారు.ఇలా పాములకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
అయితే తాజాగా ఒక మహిళ( Woman ) పామును పట్టుకుని ఏమి చేసిందో తెలిస్తే ఒక్క సారిగా అందరు షాక్ అవుతారు.

ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ముందుగా సదరు మహిళ ఒక పెద్ద పాత్రలో నీటిని పోసి అందులో నాగుపాముని ( King Cobra ) ముంచింది.అనంతరం నాగుపాము తలను పట్టుకుని మొత్తం నీటిలో ముంచి శుభ్రం చేయడం మనం వీడియోలో చూడవచ్చు.
వంట పాత్రలను శుభ్రం చేసినట్లు ఆ పామును నీళ్లతో నీటుగా శుభ్రంగా చేయడం మనం చూడవచ్చు.

సబ్బు పెట్టి బట్టలను ఉతికినట్లు ఆ పామును అటు ఇటు తిప్పి కడిగేసింది.అంతేకాకుండా ఆ పక్కనే మరొక నాగుపాము కూడా పడగ విప్పడం మనం వీడియోలో చూడవచ్చు.ఇక ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
అది పాము అనుకున్నావా? లేక క్లీనింగ్ క్లాత్ అని అనుకున్నావా? అని కొందరు కామెంట్ చేస్తూ ఉంటే.మరికొందరు ఆ మహిళ ధైర్యం గురించి కొనియాడారు.







