ప్రస్తుత రోజులలో చాలామంది వారి ఇళ్లలో కుక్కలను పెంచుకోవడం కామన్ గా మారింది.ఒకోసారి ఇంట్లో మానుషాలకంటే కుక్కల ఆలనా పాలననే ఎక్కువగా చూస్తూనే ఉంటారు.
సొంత మనుషులతో సమానంగా ఆ కుక్కలను భావించి జీవనానికి కొనసాగిస్తూ ఉంటారు.అయితే, పెట్ లవర్స్ కు డాబర్ మ్యాన్ బ్రీడ్( Doberman ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ కుక్కలు వరల్డ్ ఫాస్టెస్ట్ డాగ్స్ లో ఎనిమిదవ స్థానంలో ఉన్నాయి.వాస్తవానికి ఈ డాగ్స్ జర్మనీ ప్రాంతానికి చెందినవి.
ఈ కుక్కలకు వినికిడి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది.
తన యజమాని రక్షణ కోసం ఇవి ఎలాంటి సాహసం చేయడానికి, అలాగే వాటి ప్రాణాలను సైతం ప్రాణంగా కూడా పెడతాయి.నిజానికి ఈ కుక్కలను పోలీసులు నేరస్తులను పట్టుకునేందుకు ఉపయోగిస్తూ ఉంటారు.ఇక ఈ కుక్కల జీవతకాలం 10 నుంచి 13 సంవత్సరాల వరకు ఉంటుంది.
అయితే తాజాగా రెండు డాబర్మాన్ డాగ్స్ ఒక నాగుపామును( King Cobra ) చీల్చి చెండాలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా( Viral ) చక్కర్లు కొడుతుంది.సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కి వెళ్తే.
తెలంగాణలోని( Telangana ) మొగిలిగిద్ద గ్రామం వద్ద ఉన్న పొలంలో స్థానిక యజమాని డాబర్మాన్ కుక్కలను పెంచుకుంటూ ఉన్నాడు.ఈ క్రమంలో తాజాగా తన పొలంలో ఓ పొడవైన పాము ఈ పెట్ డాగ్స్ కంటపడింది.దీంతో ఆ కుక్కలు ఊరికే ఉండకుండా రెండు పాములు కలిసి ఆ పాము పై దాడి చేశాయి.పాముని నోటతో ఎక్కడపడితే అక్కడ కొరికి ప్రాణాలును కోల్పోయేలాగా చేశాయి.
చివరికి ఆ పాము చనిపోయిన కూడా నోట కరిచి అటు ఇటు లాగుతున్నట్టు మనం వీడియోలో చూడవచ్చు.ఈ వీడియోను చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఇలాంటి అటాకింగ్ వీడియో ఎప్పుడూ కూడా చూడలేదు అని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటే.మరికొందరు వివిధ రకాల ఈమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు.