తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో( Bigg Boss Telugu 8 ) సండే అంటే ఫన్‌డే ఆటలు, పాటలు, డ్యాన్సులతో బాగానే సాగింది.ఇలాంటి ఫన్ గేమ్ తోనే ఎపిసోడ్ మొదలైంది.
అంతకంటే ముందు గౌతమ్‌ను( Gautam ) సేవ్ చేశాడు.మరి తాజాగా జరిగిన ఎపిసోడ్ లో ఇంకా ఏమేం జరిగాయి అన్న విషయానికి వస్తే.
జూసులకు మారు పేర్లు అనే గేమ్ లో భాగంగా హరితేజ.చిల్లీ, ఆమ్ల జ్యూస్‌ను నిఖిల్‌తో తాగిపించింది.
తర్వాత పృథ్వీ.ప్రేరణకు జ్యూస్ ఇస్తూ తనకు నోటిదురుసు ఉందని, కోపిష్టి అన్నాడు.
అవినాష్.( Avinash ) గౌతమ్ కు నోటిదురుసు, బాధ్యతారాహిత్యం ఉందంటూ అతడితో లెమన్, కీరా జ్యూస్ తాగిపించాడు.
తేజ.( Teja ) ప్రేరణకు నోటిదురుసు, మందబుద్ధి ఉందని అన్నాడు.నబీల్.( Nabeel ) అవినాష్ డంబ్ అండ్ టాక్సిక్ అన్నాడు.ప్రేరణ వంతు రాగా హరితేజ ఫేక్ అంటూ ఆనియన్, ఆమ్లా జ్యూస్ తాగిపించింది.గంగవ్వ.
రోహిణికి మందబుధ్ది, నోటిదురుసు ఉందని తెలిపింది.నయని( Nayani ) కూడా ప్రేరణకు కోపమెక్కువ అంటూ నిమ్మ, మిర్చి జ్యూస్ కలిపిచ్చింది.
నిఖిల్.గౌతమ్ బాధ్యతారాహిత్యంగా ఉంటాడంటూ అతడికి లెమన్, కీర జ్యూస్ కలిపిచ్చాడు.
అలా ప్రేరణ, గౌతమ్ అందరికంటే ఎక్కువ జ్యూస్‌లు తాగారు.తర్వాత నాగ్ హరితేజను సేవ్ చేసి నయని ఎలిమినేట్( Nayani Eliminate ) అయినట్లు ప్రకటించాడు.అయితే హౌస్ లో ప్రతి చిన్న విషయానికి కన్నీళ్లు పెట్టుకునే నయని ఈసారి తన దుఃఖాన్ని దిగమింగుకుని నవ్వుతూ అందరి దగ్గర వీడ్కోలు తీసుకోవడం విశేషం.స్టేజీపైకి వచ్చాక… గంగవ్వ, రోహిణి, ప్రేరణ, గౌతమ్, విష్ణును డమ్మీ ప్లేయర్స్ అంది.
హరితేజ, నిఖిల్, పృథ్వీ బెస్ట్ ప్లేయర్స్ అని తెలిపింది.