ఈటీవీలో ప్రసారమవుతున్న నా ఉచ్ఛ్వాసం కవనం( Naa Uchvasam Kavanam ) కార్యక్రమానికి టాలీవుడ్ హీరో ప్రభాస్( Prabhas ) అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే.తాజాగా ఈ కార్యక్రమం రెండో పార్ట్ తాజాగా విడుదలైంది.
ఇందులో ప్రభాస్ తనకు ఇష్టమైన పాటల గురించి పంచుకున్నారు.సిరివెన్నెల సీతారామశాస్త్రితో( Sirivennela Sitaramasastri ) తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా హీరో ప్రభాస్ మాట్లాడుతూ.సిరివెన్నెల సినిమాలోని విధాత తలపున ప్రభవించినది.
పాట చాలా గొప్పగా ఉంటుంది.
సరసుస్వర సుర ఝరీగమనమౌ సామవేద సారమిది లైన్స్ అంత బాగా ఎలా రాశారో.సిరివెన్నెల గారు పెన్ను పెట్టగానే ఇలాంటి గొప్ప లిరిక్స్ వచ్చేస్తాయేమో.అలాగే నిన్నే పెళ్లాడతా( Ninne Pelladatha ) సినిమాలో కన్నుల్లో నీ రూపమే పాట అంటే నాకు చాలా ఇష్టం.
ఆ పాట చరణంలో వచ్చే లైన్స్ కి నేను వీరాభిమానిని.ప్రతి తరానికి సరిపోయేలా రాయడం సిరివెన్నెల గొప్పతనం అని పొగడ్తల వర్షం కురిపించారు ప్రభాస్.కాగా నిన్నే పెళ్లాడతా సినిమాలో నాగార్జున( Nagarjuna ) హీరోగా నటించిన విషయం తెలిసిందే.
ఇకపోతే డార్లింగ్ ప్రభాస్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రభాస్.బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు.అంతేకాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరోల్లో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నారు.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 4,5 పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.