ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరో ప్రభాస్…( Prabhas ) ఇక ఇప్పటికే ఆయన బాహుబలి సినిమాతో తనకంటూ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.ఇక ఆ తర్వాత చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలను కూడా సాధిస్తున్నాయి.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయనతో పాటు చాలామంది దర్శకులు సినిమాలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు.

ముఖ్యంగా ప్రశాంత్ వర్మ,( Prasanth Varma ) లోకేష్ కనకరాజు( Lokesh Kanagaraj ) లాంటి స్టార్ డైరెక్టర్లు సైతం ఆయనతో సినిమా చేసి ఎలాగైనా భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ వాళ్లకి అవకాశాన్ని ఇస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే లోకేష్ కనకరాజ్ కూలీ సినిమా( Coolie ) చేస్తున్నాడు.
ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే ప్రభాస్ తో సినిమా చేయడం ఈజీ అవుతుంది.అలాగే ప్రశాంత్ వర్మ కూడా ఇప్పుడు చేస్తున్న జై హనుమాన్( Jai Hanuman ) సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకుంటే ప్రభాస్ తో ఒక భారీ సినిమాను తెరకెక్కించే అవకాశం కూడా ఉంది.

కాబట్టి ఎలాగైనా సరే ఈ యంగ్ డైరెక్టర్స్ ప్రభాస్ ని టార్గెట్ చేసుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో భారీ వసూళ్లను రాబట్టడంలో తన సత్తా ఏంటో చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు… ఇక ఈ సినిమాతో తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకుంటున్న ప్రభాస్ ఇప్పుడు చేయబోయే సినిమాలతో భారీ సక్సెస్ లను సాధిస్తే మాత్రం పాన్ వరల్డ్ లో కూడా ఆయన మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరో అవుతాడు…
.







