జీవితంలో కొంతమంది సక్సెస్ స్టోరీలు( Success Stories ) చదివే సమయంలో మన కళ్లు చెమర్చుతాయి.నెల్లూరు జిల్లా( Nellore District ) ముత్తుకూరుకు చెందిన భవాని( Bhavani ) సక్సెస్ స్టోరీ వింటే ఒకింత ఆశ్చర్యానికి గురి కావాల్సి ఉంటుంది.
ఒక ప్రమాదంలో తండ్రిని, కుడి చేతినీ కోల్పోయినా ప్రతిభతో పతకాలను సాధిస్తున్న ఆమె సక్సెస్ స్టోరీ నేటి తరంలో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

నెల్లూరు జిల్లా ముత్తుకూరుకు చెందిన భవాని ఐదో తరగతిలోనే క్రీడల్లో మొదటి స్థానంతో పతకాలను సాధించింది.భవాని ఎప్పుడూ ఆటలకే ప్రాధాన్యత ఇచ్చేది.అయితే 2009 సంవత్సరంలో భవాని లారీ ఎక్కి ఆడుకుంటున్న సమయంలో ఒక విద్యుత్ తీగ తెగి ఆమెపై పడింది.
ఆ సమయంలో కూతురిని కాపాడాలని ప్రయత్నించిన భవాని తండ్రి చంద్రయ్య ఆ ప్రయత్నాల్లో విద్యుత్ షాక్ కు గురై ప్రాణాలను కోల్పోయారు.

ఆ సమయంలో ఒళ్లంతా గాయాలైన భవాని కుడి చేతిని డాక్టర్లు తీసేశారు.తండ్రి మృతితో భవానికి ఆర్థిక ఇబ్బందులు సైతం ఎదురయ్యాయి.అయితే తల్లి సపోర్ట్ తో భవాని బాధను దిగమింగుకుని లోపాన్ని పట్టించుకోకుండా ఆటలపై దృష్టి పెట్టారు.ఏలూరులోని స్టేడియంలో జరిగిన పోటీలలో భవాని మొదటి పతకం సాధించారు.2018 రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలలో ఆమె సత్తా చాటారు.
గతేడాది భవానికి అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే అవకాశం దక్కింది.అప్పు చేసి మరీ ఎంట్రీ ఫీజు చెల్లించిన భవాని థాయిలాండ్ లో( Thailand ) జరిగిన వరల్డ్ ఎబిలిటీ సపోర్ట్ గేమ్స్ లో ఆడి కాంస్యం గెలుచుకున్నారు.
కొంతకాలం క్రితం బెంగళూరులో జరిగిన ఓపెన్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ పోటీలలో సైతం ఆమె సత్తా చాటారు.మన దేశం, నాన్న రుణాన్ని తీర్చుకోవడమే తన లక్ష్యమని ఆమె చెబుతున్నారు.







