నువ్వులను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..

నువ్వులలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌, ప్రోటీన్లు ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్ ఫ్యాట్స్‌, ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, యాంటీహిస్టమెన్స్‌ పుష్కలంగా ఉంటాయి.అందుకోసం రోజు వారి ఆహారంలో నువ్వులను బాగా చేసుకుంటే నిరోధక శక్తి పెరుగుతుంది.

 Health Benefits Of Eating Sesame Seeds,sesame Seeds,telugu Health,health Tips,vi-TeluguStop.com


వీటిలో ఉన్న ఐరన్, క్యాల్షియం వల్ల విటమిన్ ఈ శరీరానికి సమృద్ధిగా లభిస్తుంది. రక్తహీనతతో బాధపడే మహిళలు వీటిని తింటే నీరసం తగ్గుతుంది.మోకాళ్లు శరీరంలో నొప్పులతో నిత్యం బాధపడేవారు నువ్వులు బెల్లం కలిపి ఉండలు చేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.కానీ ఏ తినే పదార్థమైన తగిన మోతాదులో తినడమే మంచిది.

వీటిలో పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.వీటిలో ఉండే ఫైటో స్టెరాల్స్‌ వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి తగ్గుతుంది.

దాని వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.నల్ల నువ్వుల్లో క్యాన్సర్ ను నివారించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి.


ఇవి బ్రెయిన్ లో ట్యూమర్ గ్రోత్ ను నివారిస్తాయి.అంతేకాకుండా హృదయనాళాలను చురుకుగా పని చేసేలా చేస్తాయి.వీటిలో 20 శాతం ప్రోటీన్లు, క్యాల్షియం అధికంగా ఉంటాయి.దెబ్బలు తగిలినప్పుడు త్వరగా మానడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.నువ్వుల నూనెలో ఉండే ప్రోటీన్లు శరీరంలో అధిక రక్త పీడనాన్ని అదుపులో ఉంచుతాయి.వీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ప్లాస్మాలోని గ్లూకోజ్ స్థాయిలను పెరిగేలా చేస్తుంది.

ఇన్ని ప్రయోజనాలు ఉన్న నువ్వుల నూనెను అప్పుడప్పుడు జుట్టుకు పట్టించి శుభ్రం చేసుకుంటూ ఉంటే వెంట్రుకలు నల్లగా మారి ఆరోగ్యంగా ఉంటాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube