నిన్న బిహార్‌లోని బుక్సార్ రైల్వే స్టేషన్‌లో (Buxar Railway Station, Bihar)ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది.దానాపూర్ డీఆర్‌ఎం జయంత్ కాంత్ చౌదరి (Danapur DRM Jayant Kant Chowdhury)స్టేషన్‌ను పరిశీలిస్తుండగా.
టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న కొందరు మహిళల్ని చూసి షాక్ అయ్యారు.ఎందుకని అడిగితే వాళ్లు చెప్పిన సమాధానం విని ఆయనకు మైండ్ బ్లాంక్ అయిపోయింది.
“మీ దగ్గర టికెట్లు ఎందుకు లేవు?” అని డీఆర్‌ఎం సీరియస్‌గా ప్రశ్నిస్తే ఆ మహిళలు ఏ మాత్రం తడుముకోకుండా “మేం ఫ్రీగా వెళ్లొచ్చని మోదీ (modi)చెప్పారు” అని టక్కున సమాధానం ఇచ్చారు.వాళ్ల మాటలు విని డీఆర్‌ఎం జయంత్ కాంత్ చౌదరి ఒక్కసారిగా అవాక్కయ్యారు.
నవ్వాలో ఏడ్వాలో తెలియక కాసేపు నవ్వుతూ ఉండిపోయారు.మళ్లీ వాళ్లని ఏమీ అనకుండా ఊరుకున్నారు.
ఇంకాస్త డీప్‌గా ఎంక్వైరీ చేస్తే అసలు విషయం తెలిసింది.ఆ మహిళలు మహా కుంభ స్నానం కోసం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్నారంట.టికెట్ కొనకుండానే ఫ్రీగా పోతున్నామని అనుకున్నారు పాపం.మోదీ ఎప్పుడూ ఫ్రీగా వెళ్లమని చెప్పలేదని, టికెట్ లేకుండా ప్రయాణం చేయడం రైల్వే రూల్స్‌కు విరుద్ధమని డీఆర్‌ఎం వాళ్లకు క్లారిటీ ఇచ్చారు.
స్టేషన్‌లో ఉన్న ఎవరో ఈ సీన్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.అంతే.
వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది.మహిళలు చెప్పిన రిప్లైకి, డీఆర్‌ఎం రియాక్షన్‌కి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.“మోదీ పేరు చెప్పి బురిడీ కొట్టించాలనుకున్నారా ఏంటి?” అని కామెంట్లు పెడుతున్నారు.
ఈ ఇన్సిడెంట్ చూస్తే.తప్పుడు సమాచారం ఎంత ఈజీగా స్ప్రెడ్ అవుతుందో అర్థమవుతోంది.డీఆర్‌ఎం జయంత్ కాంత్ చౌదరి మాత్రం ఈ సిట్యుయేషన్‌ను చాలా కూల్‌గా హ్యాండిల్ చేశారు.
దీన్ని ఒక ఛాన్స్ కింద తీసుకుని అందరికీ రైల్వే రూల్స్ గురించి చెప్పారు.ప్రయాణం చేసే ముందు టికెట్ తీసుకోవడం ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేశారు.
మొత్తానికి ఈ ఇన్సిడెంట్ ఫన్నీగా ఉన్నా.రైల్వే ట్రావెల్ రూల్స్ గురించి అందరికీ ఒక ఇంపార్టెంట్ లెసన్ చెప్పింది.