సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి రష్మిక మందన్న ( Rashmika Mandanna )ఒకరు.ప్రస్తుతం ఈమె నేషనల్ క్రష్ , పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రష్మిక వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె నటుడు విజయ్ దేవరకొండ( Vijay Devarakonda )తో ప్రేమలో ఉన్నారు అంటూ తరచు వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి కానీ వీరిద్దరూ మాత్రం తమ ప్రేమ విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా బయట పెట్టలేదు.

ఇక రష్మిక తాను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని ఆ వ్యక్తి ఎవరో మీ అందరికీ తెలుసు అంటూ పరోక్షంగా విజయ్ దేవరకొండ గురించిమాట్లాడేరే తప్ప విజయ్ దేవరకొండ గురించి తన ప్రేమ( Love ) గురించి ఎప్పుడు బయట పెట్టలేదు.ఇకపోతే వీరిద్దరూ తరచూ వెకేషన్ లకి వెళ్లడం , ఇద్దరు కలిసి కనిపించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఏ క్షణమైనా ఈ ప్రేమ విషయాన్ని బయట పెట్టవచ్చు అని అందరూ భావిస్తున్నారు.

తాజాగా రష్మిక సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.అయితే ఈమె పరోక్షంగా విజయ్ దేవరకొండపై ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ ఈ పోస్ట్ ను చేశారని స్పష్టమవుతుంది.రోజ్ ఫ్లవర్ బొకేని ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన రష్మిక నా ముఖంపై చిరునవ్వును ఎలా తెప్పించాలో నీకు బాగా తెలుసు పాపలు అనే క్యాప్షన్ ఇవ్వడమే కాకుండా ఈ పోస్టుకు రెడ్ హార్ట్ లవ్ సింబల్ ఎమోజిని కూడా పెట్టారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కచ్చితంగా ఈ పోస్ట్ విజయ్ దేవరకొండను ఉద్దేశించి పోస్ట్ చేశారని, ఆ ఫ్లవర్ బొకే కూడా విజయ్ దేవరకొండ పంపించి ఉంటారని అభిమానులు ఈమె పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు.