విశ్వక్ సేన్( Vishwak Sen ).గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.
టాలీవుడ్ యంగ్ హీరో అయిన విశ్వసించిన ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.ఏడాదికి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఫుల్ బిజీబిజీగా ఉన్నాడు.
ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు తన సినిమాల ద్వారా లేనిపోని కాంట్రవర్సీలు కొని తెచ్చుకుంటున్నారు విశ్వక్ సేన్.అలాగే విశ్వక్ సేన్ కు ఫ్లాపులు కొత్త కాదు.
కానీ ఇలా వచ్చిన ఫ్లాపులన్నీ ఒకెత్తు, ఇటీవల వచ్చిన లైలా సినిమా మరో ఎత్తు అని చెప్పాలి.ఈ హీరో కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది లైలా మూవీ.

ఇటీవల రిలీజైన ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.థియేటర్లలో పట్టుమని గంట కూడా ప్రేక్షకుడు కూర్చోలేని పరిస్థితి.రివ్యూలు కూడా అటు ఇటుగా 1 నుంచి 1.5 మధ్యనే ఎక్కువగా వచ్చాయి.ఇలాంటి చెత్త సినిమా విశ్వక్ కెరీర్ లోనే రాలేదనేది పబ్లిక్ టాక్.అలా వీకెండ్ గడిచేసరికి నిర్మాతకు భారీగా నష్టాలు తెచ్చిపెట్టడంతో పాటు, హీరో కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది లైలా మూవీ( Laila Movie ).అయితే ఈ సినిమా శని, ఆదివారాల్లో కోలుకుంటుందని మూవీ మేకర్స్ భావించారు.

కానీ వీకెండ్ లో కూడా షోలు రద్దయ్యాయి అంటే ఈ సినిమా పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.ఈ సినిమాతో నిర్మాతకు థియేట్రికల్ గా 5 నుంచి 6 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్టు తెలుస్తోంది.సినిమా విడుదల తర్వాత మరిన్ని ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అనుకున్నారు మేకర్స్.
మొదటి రోజు వచ్చిన టాక్ చూసి, రెండో రోజు నుంచే ప్రచారం ఆపేశారు.ఇలా ఈ సినిమా చాలా కారణాల వల్ల విశ్వక్ సేన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.