ఓరి దేవుడో.. జంతువులు మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. (వీడియో)

జంతువులు మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందో ఊహించగలరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) (AI) ఇప్పుడు ఆ ఊహల్ని నిజం చేస్తోంది.మానవులు కలలో కూడా ఊహించలేని చిత్రవిచిత్రమైన వీడియోలను సృష్టిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

 Do You Know What It Would Be Like If Animals Walked Like Humans?, Ai Animal Vide-TeluguStop.com

ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల వాయిస్‌లు, రూపాలతో అచ్చం నిజమైన వీడియోల్లాంటి వాటిని క్రియేట్ చేసి షాక్ ఇచ్చింది.ఇప్పుడు జంతువులకు కూడా అద్భుతమైన మార్పులు చేస్తూ సరికొత్త వీడియోలతో విస్మయానికి గురిచేస్తోంది.

ఉదాహరణకు, కుక్క రెక్కలు మొలిచి వేరే గ్రహంపై ఎగురుతున్నట్టు, పిల్లి నీళ్లలో ఈదుతున్నట్టు.ఇలా ఎన్నో వింతలు AI మన కళ్ల ముందు చూపిస్తోంది.

ఇటీవల ఒక వ్యక్తి, “జంతువులు మనుషుల్లాగా (Animals are like people)నడిస్తే ఎలా ఉంటుంది?” అని AIని అడిగారు.వెంటనే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతం చేసింది.

జంతువులు నిజంగా మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందో వీడియో రూపంలో చూపించింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో జెర్సీ దున్నపోతు సిక్స్ ప్యాక్ బాడీతో (Jersey buffalo with a six-pack body)నిలబడి హృతిక్ రోషన్ లా కనిపించింది.ఇక పెద్ద కొమ్ములున్న ఏనుగు అయితే అచ్చం డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లింగ్ స్టార్ మార్క్ హెన్రీలా ఉంది.జిరాఫీ మనిషిలా నిలబడి నడుస్తుంటే చూడటం నిజంగా ఆశ్చర్యం కలిగించింది.అంత పెద్ద జంతువు అలా నడుస్తుంటే షాక్ అవ్వక తప్పదు.అది హాయిగా బీచ్‌లో నడుచుకుంటూ వెళ్తుంటే చూడటానికి చాలా వింతగా, ఫన్నీగా ఉంది.

మగ సింహం అయితే కండలు తిరిగిన బాడీతో, అర్జున్ రెడ్డిలా యాంగ్రీ లుక్ ఇస్తూ నడుస్తోంది.డ్రాయర్ వేసుకుని అది నడుస్తుంటే నవ్వాగడం కష్టం.గద్ద కూడా మనిషిలా నడిచింది.

తోడేలు కూడా మనిషిలాగే నడుస్తూ కనిపించింది.నల్ల త్రాచు పాము కండలు తిరిగిన చేతులతో భయంకరంగా ఉంది.

అది అలా ముందుకు సాగుతుంటే భయమేస్తుంది.ఖడ్గమృగం, తాబేలు కూడా మనుషుల్లా నడవడం ఈ వీడియోలో చూడొచ్చు.

ఇలా రకరకాల జంతువులు మనుషుల్లా నడుస్తూ ఉంటే చూడటానికి చాలా ఫన్నీగా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదూ.మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube