ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar )హత్య తర్వాత భారత్ – కెనడాల మధ్య సంబంధాలు పూర్తిగా దిగజారిపోయిన సంగతి తెలిసిందే.నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canadian Prime Minister Justin Trudeau ) .
ఏకంగా భారత దౌత్యవేత్తల పేర్లను అనుమానాస్పద జాబితాలో చేర్చడంపై మోడీ( Modi ) సర్కార్ భగ్గుమంది.కెనడాలోని ఆరుగురు భారతీయ దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవడంతో పాటు న్యూఢిల్లీలోని కెనడియన్ దౌత్యవేత్తలను బహిష్కరించింది.
ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతుండగా .కెనడాలోని పరిస్ధితుల దృష్ట్యా ఆ దేశంలో చదువుకునేందుకు , ఉద్యోగాలు చేసేందుకు భారతీయ యువత ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు.

ఇలాంటి సంక్షోభ పరిస్ధితుల్లోనూ భారత్ – కెనడా వాణిజ్య సంబంధాలు స్థిరంగా ఉన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.2023 కంటే 2024లో ఇవి కాస్త మెరుగైనట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.2024లో వస్తువుల పరంగా ద్వైపాక్షిక వాణిజ్యం మొత్తం విలువ 11.36 బిలయన్ల కెనడా డాలర్లు (భారతీయ కరెన్సీలో దాదాపు రూ.69,368 కోట్లు) .ఈ సంఖ్య 2023లో 10.74 బిలియన్ల కెనడా డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ.65,723 కోట్లు)గా ఉంది.2020 నుంచి 2024 వరకు వస్తువుల వ్యాపార పరిమాణం 64 శాతం పైగా పెరిగి 7.63 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.42,139 కోట్లు)గా ఉందని స్టాటిస్టిక్స్ కెనడా గణాంకాలు చెబుతున్నాయి.

టొరంటోలని భారత కాన్సులేట్ పోస్ట్ చేసిన ట్రేడ్ డాష్‌బోర్డ్( Trade Dashboard posted by Consulate of India ) జనవరి నుంచి నవంబర్ వరకు ఇలాంటి డేటాను ఇచ్చింది .ఇది ఓ మోస్తరుగా పెరుగుదలను సూచిస్తోందని పేర్కొంది.భారత్ నుంచి కెనడాకు ఎక్కువగా మందులు, ఆభరణాల వస్తువులు, స్మార్ట్‌ఫోన్‌లు, సముద్ర ఆహారం, వజ్రాలు వంటివి ఎక్కువగా ఉన్నాయి.
అలాగే భారత్‌కు బఠానీలు, బిటుమినస్ బొగ్గు, గింజ ధాన్యాలు, పొటాషియం క్లోరైడ్ , న్యూస్ ప్రింట్ వంటివి కెనడా నుంచి ఎగుమతి అవుతాయి.