బ్రిటన్ సైన్యంలో( British Army ) మహిళల పట్ల జరుగుతున్న దారుణమైన ప్రవర్తన గురించిన దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.రాయల్ ఆర్టిలరీకి చెందిన 19 ఏళ్ల జేస్లీ బెక్( Jacely Beck ) అనే సైనికురాలు 2021 డిసెంబర్ 15న లార్క్‌హిల్ క్యాంప్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించింది.
ఈ కేసు విచారణలో ఓ మాజీ సైనికురాలు చెప్పిన మాటలు విని అందరూ షాక్ అవుతున్నారు.టంజిన్ హార్ట్ ( Tanjin Heart )అనే 23 ఏళ్ల మాజీ సైనికురాలు కోర్టుకు చెప్పిన వివరాల ప్రకారం, మహిళా సైనికులు పురుష సహోద్యోగుల నుంచి నిత్యం అసభ్యకరమైన కామెంట్లు, వేధింపులు ఎదుర్కొంటున్నారని తెలిపింది.తాను మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నా, తనకూ ఈ చేదు అనుభవం తప్పలేదని వాపోయింది.
“నేను పనిచేసే విభాగంలో నేనొక్కదాన్నే మహిళా సైనికురాలిని.అందుకే చాలా మంది పురుషులు నన్ను అసభ్యంగా చూసేవారు.ముఖ్యంగా మద్యం తాగిన సమయంలో వాళ్ల వేధింపులు మరింత ఎక్కువయ్యేవి.నా గది నుంచి బయటకు రావాలంటేనే భయపడేదాన్ని.ఎప్పుడు ఏ అసభ్యకరమైన కామెంట్ వినాల్సి వస్తుందో అని టెన్షన్ పడేదాన్ని” అని హార్ట్ కోర్టుకు తెలిపింది.
పురుషులు తన గది తలుపు తట్టేవారని, మొదట్లో తలుపులు లాక్ చేయకుండా వదిలేసేదాన్నని, కానీ నిద్రపోతున్న సమయంలో ఎవరైనా లోపలికి వస్తారేమో అనే భయంతో తలుపులు లాక్ చేయడం మొదలుపెట్టానని హార్ట్ చెప్పింది.

జేస్లీ బెక్ కూడా ఇలాంటి సమస్యల గురించి ఎప్పుడైనా మాట్లాడిందా అని కోర్టు ప్రశ్నించగా, లేదని హార్ట్ బదులిచ్చింది.కానీ బెక్ చాలా అందంగా ఉండటం వల్ల ఆమె కూడా వేధింపులు ఎదుర్కొందని తనకు తెలుసు అని చెప్పింది.పురుషులు ఆమె గురించి అసభ్యంగా మాట్లాడుకోవడం తాను స్వయంగా విన్నానని హార్ట్ వెల్లడించింది.
సైన్యంలో మహిళలను “లెస్బియన్”, “స్లాగ్” ( “Lesbian”, “Slog” )అంటూ అసభ్య పదాలతో దూషిస్తారని, వారి గురించి చెడుగా మాట్లాడుకుంటారని హార్ట్ వాపోయింది.పురుష సైనికులు మహిళలను తమ గదులకు పిలిచేవారని, ఒకవేళ మహిళలు ఒప్పుకోకపోతే వారిని అవమానించేవారని తెలిపింది.

ఒక ట్రైనింగ్ క్యాంప్‌లో ఒక ఇన్‌స్ట్రక్టర్ తనను లావుగా ఉన్నావని, గర్భవతివా అని అందరి ముందు అవమానించాడని హార్ట్ కన్నీళ్లు పెట్టుకుంది.అంతేకాదు, 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక సార్జెంట్ కండోమ్‌తో తన తలుపు ముందు నిలబడి వేధించిన భయానక సంఘటనను కూడా గుర్తు చేసుకుంది.జేస్లీ బెక్ కూడా వేధింపులు ఎదుర్కొందట.సూపర్‌వైజర్ ర్యాన్ మేసన్ వేల మెసేజ్‌లు పంపి టార్చర్ పెట్టేవాడని తెలిసింది.అంతేకాదు, మైఖేల్ వెబర్ అనే మరో అధికారి బార్బెక్యూ పార్టీలో ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడట.ఫిర్యాదు చేసినా పై అధికారి పట్టించుకోలేదట.
షాకింగ్ విషయం ఏంటంటే, మేసన్ ఆమెకు తెలియకుండానే హోటల్ రూమ్ బుక్ చేశాడు.దీంతో అనుమానం వచ్చి బెక్ నిలదీసింది.
అతని వేధింపులు తట్టుకోలేక దూరంగా ఉండమని చెప్పింది.బెక్ చనిపోవడానికి ముందే మేసన్ రాజీనామా చేశాడు.
మరోవైపు జార్జ్ హిగ్గిన్స్ అనే వ్యక్తితో బెక్ రిలేషన్‌షిప్ గురించి అడిగితే చెప్పడానికి నిరాకరించాడు.ఇలా సైన్యంలో దారుణాలు జరుగుతున్నాయని విచారణలో వెల్లడవుతోంది.
ఈ కేసు ఇంకా నడుస్తోంది.







