పొరపాటున కూడా పరమేశ్వరుడికి ఈ వస్తువులతో పూజ చేయకూడదు..?

త్రిమూర్తులలో ఒకరైన పరమేశ్వరుడిని ఎంతో మంది భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు.ఈ క్రమంలోనే స్వామివారి అనుగ్రహం పొందడం కోసం వివిధ రకాల పుష్పాలు ఫలాలు చేత స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు.

 The Things You Should Not Offer To Maha Shiva During Pooja,  Lord Shiva, Shravan-TeluguStop.com

ఇలా చేయటం వల్ల స్వామి వారి కృప మనపై ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు.కానీ అన్ని దేవతల మాదిరిగా కాకుండా పరమేశ్వరుడికి పూజా విధానం ప్రత్యేకంగా ఉంటుంది.

పరమేశ్వరుడికి పూజ చేసే సమయంలో భక్తులు కొన్ని నియమాలను తప్పక ఆచరించాలి.పరమేశ్వరుడి పూజలో కొన్ని వస్తువులను పొరపాటున కూడా ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు.

ఆ వస్తువులను ఉపయోగించి పూజ చేయటం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని పూజ చేసిన వ్యర్థమేనని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.మరి పరమేశ్వరుడికి ఏ వస్తువులతో పూజ చేయకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా ఏ దేవదేవతకైనా పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమను తప్పనిసరిగా ఉపయోగిస్తాము.

కానీ ఆ బోలా శంకరుడికి పూజ సమయంలో పసుపు కుంకుమలను ఎలాంటి పరిస్థితులలో కూడా వాడకూడదని పండితులు చెబుతున్నారు.స్వామివారు త్రినేత్రుడు కనుక స్వామివారి మూడవకన్ను అడ్డుగా కుంకుమ పెట్టకూడదని పండితులు చెబుతున్నారు.

అదేవిధంగా శివలింగం అనేది పురుషతత్వానికి ప్రతీక.పసుపు అనేది కేవలం స్త్రీలకు సంబంధించినది.

అందుకోసమే పరమేశ్వరుడి పూజలో పసుపును ఉపయోగించరు.

Telugu Coconut, Lord Shiva, Lord Shiva Puja, Mahashiva Pooja, Tulasi Shiva, Pasu

అదేవిధంగా పరమేశ్వరుడికి కొబ్బరినీళ్ళను నిషేధించారు.స్వామివారికి సమర్పించేవి ఎంతో స్వచ్ఛంగా ఉండాలి.కొబ్బరి నీళ్లను స్వామివారికి సమర్పించిన తర్వాత మనం తాగుతాము కనుక కొబ్బరి నీళ్లను శివుడి కి సమర్పించకూడదని చెబుతారు.

పురాణాల ప్రకారం శంఖచుడు అనే రాక్షసుడు శివుడు చేతిలో మరణించాడు అందుకోసమే శంఖంలో పోసిన నీటితో స్వామివారికి అభిషేకం నిర్వహించకూడదు.అదేవిధంగా తులసి ఆకులను ఎలాంటి పరిస్థితులలో కూడా పరమేశ్వరుడి పూజకు ఉపయోగించరు.

కేవలం బిల్వ దళాలను మాత్రమే పరమేశ్వరుడికి సమర్పించాలి.అదేవిధంగా ఎర్రటి పుష్పాలతో పరమేశ్వరుడికి పూజ చేయకూడదు.

ఇలాంటి వస్తువులతో స్వామివారికి పూజ చేసిన ఆ పూజకు ఎలాంటి ఫలితం ఉండదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube