ఈరోజు కూడా ఫైనల్ మ్యాచ్ కు వర్ష గండం ఉంటే.. పరిస్థితి ఏంటంటే..?

If There Is Rain For The Final Match Today Too What Will Be The Situation Details, IPL2023,Ipl Latest News,IPL Final Match Latest News,IPL Final Match Rain Stoped Updates,Final Match Postponed News,Title Winner Updates

ఐపీఎల్ ( IPL )చరిత్రలో వర్షం కారణంగా తొలిసారి ఫైనల్ మ్యాచ్( Final match ) వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.ఆదివారం రాత్రి 7:30 లకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం( Modi Stadium ) క్రికెట్ అభిమానులతో నిండిపోయింది.మరి కాసేపట్లో టాస్ వేస్తారనుకుంటే వర్షం ( Rain effect )మొదలైంది.కాసేపటికి వర్షం ఆగడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు.సిబ్బంది మైదానాన్ని శుభ్రం చేయడం ప్రారంభించే లోపు మళ్ళీ చినుకులు ప్రారంభమయ్యాయి.దాదాపుగా రాత్రి 11 గంటల వరకు వేచి చూసిన వరుణుడు కరుణించకపోవడంతో ఇరుజట్ల కోచ్ లు ఆశిష్ నెహ్రా, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో అధికారులు చర్చలు జరిపి మ్యాచ్ వాయిదా వేయాలని నిర్ణయించారు.

 If There Is Rain For The Final Match Today Too What Will Be The Situation Detail-TeluguStop.com
Telugu Final, Iplfinal, Ipl Latest, Ipl, Latest Telugu, Ups-Sports News క్

అయితే మ్యాచ్ జరగకుండానే విన్నర్ ను ప్రకటిస్తారేమో అనే ఆందోళన క్రికెట్ అభిమానులను కాస్త కలవర పెట్టింది.ఫైనల్ మ్యాచ్ వాయిదా పడడంతో ఫైనల్ మ్యాచ్ టికెట్లను సోమవారం జరిగే మ్యాచ్లో కూడా అనుమతి ఇస్తామని ప్రకటించడంతో అభిమానుల్లో ఉండే ఉత్కంఠ వీడింది.

కానీ ఈరోజు కూడా వర్షం కురిసే అవకాశాలు చాలానే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.అంతేకాదు పది నుండి 15 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విస్తాయని తెలిపింది.

దీంతో ప్రేక్షకుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.

Telugu Final, Iplfinal, Ipl Latest, Ipl, Latest Telugu, Ups-Sports News క్

నైరుతి రుతుపవనాల రాకతో భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఆ రాష్ట్రాలలో గుజరాత్ కూడా ఉంది.కాబట్టి నేడు వర్షం పడినా కూడా మ్యాచ్ వాయిదా పడే ప్రసక్తే లేదు.

ఒకవేళ మ్యాచ్ కు అంతరాయం కలిగితే కనీసం సూపర్ ఓవర్ నిర్వహించి విజేతను ప్రకటిస్తారు.అలా కుదరని పక్షంలో ఇక గుజరాత్ ను విన్నర్ గా.చెన్నై ను రన్నర్ గా ప్రకటిస్తారు.ఎందుకంటే లీగ్ పాయింట్ల పట్టికలో గుజరాత్ అగ్రస్థానంలో ఉండడంతో ఈ జట్టుకే టైటిల్ దక్కే అవకాశం ఉంది.

క్రికెట్ అభిమానులు నేడు వర్షం పడకుండా మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నారు.ప్రస్తుతం ఫైనల్ మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా అందరినీ కలవర పెడుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube