మీ కురుల‌ను ఒత్తుగా, పొడవుగా మ‌రియు బ‌లంగా మార్చే సూప‌ర్ రెమెడీ ఇదే!

తమ కురులు ఒత్తుగా, పొడవుగా మ‌రియు బలంగా ఉండాలని అందరూ కోరుకుంటారు.కానీ వాతావరణంలో వచ్చే మార్పులు, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, ఒత్తిడి తదితర కారణాల వల్ల జుట్టు కుదుళ్ళు బలహీనంగా మారిపోతుంటాయి.

 This Is A Super Remedy To Make Your Hair Thicker, Longer And Stronger! Thick Hai-TeluguStop.com

ఫ‌లితంగా హెయిర్ ఫాల్ పెరిగి.కురులు పల్చగా మారుతుంటాయి.

దాంతో ఏం చేయాలో తెలియక తీవ్రంగా మ‌దన ప‌డిపోతూ ఉంటారు.ఈ లిస్టులో మీరు ఉన్నారా.? అయితే ఇకపై టెన్షన్ వద్దు.

ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సూప‌ర్ రెమెడీని పాటిస్తే కనుక జుట్టును సులభంగానే ఒత్తుగా, పొడవుగా మరియు బలంగా మార్చుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందు నాలుగు ఉసిరి కాయలు తీసుకుని నీటిలో శుభ్రంగా కడగాలి.ఇలా కడిగిన ఉసిరి కాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే ప‌ది నుంచి ప‌దిహేను కరివేపాకు ఆకులు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.

ఇప్పుడు బ్లెండ‌ర్‌లో కట్ చేసి పెట్టుకున్న ఉసిరి కాయ ముక్కలు, కరివేపాకు ఆకులు, నాలుగు టేబుల్ స్పూన్ల ప‌చ్చి కొబ్బరి తురుము, కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Spray, Remedy, Latest, Long, Thick-Telugu Health T

ఈ జ్యూస్ లో నాలుగు చుక్కలు పిప్పర్మెంట్ ఎసెన్షియల్ ఆయిల్ ను మిక్స్ చేసి ఒక స్ప్రే బాటిల్ లో నింపాలి.ఆపై జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు తయారు చేసుకున్న‌ మిశ్రమాన్ని స్ప్రే చేసుకుని రెండు గంటల పాటు షవర్ క్యాప్ ధరించాలి.అనంతరం మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే కురులు ఒత్తుగా, పొడవుగా మరియు బలంగా మారడం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube