సలార్ సినిమాలో కీలక పాత్రల కోసం మలయాళీ సూపర్ స్టార్

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై గత కొద్ది రోజులుగా సలార్ సినిమా రీసౌండ్ వినిపిస్తుంది.డార్లింగ్ ప్రభాస్ నుంచి రాబోతున్న మరో పాన్ ఇండియా మూవీ కావడం ఒకటి కాగా, కేజీఎఫ్ తో ఇండియన్ వైడ్ ఫేమస్ అయిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రావడం మరో కారణంగా కనిపిస్తుంది.

 Mohan Lal Important Role In Salaar Movie, Tollywood, Bollywood, South Cinema, Da-TeluguStop.com

ఇదిలా ఉంటే కేజీఎఫ్ తెరకెక్కించిన నిర్మాతలే ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.మాఫియా నేపధ్యంలోనే తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రోల్ కేజీఎఫ్ తరహాలో కంప్లీట్ నెగిటివ్ హీరోయిజంతో ఉంటుందని సమాచారం.

ఇక వచ్చే ఏడాది ఆఖరున ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటీమణుల కోసం ప్రయత్నం చేస్తున్నారు.

మరో విప్పు ఇందులో కీలక పాత్రల కోసం స్టార్ క్యాస్టింగ్ ని రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.అన్ని భాషల ప్రేక్షకులని మెప్పించే విధంగా క్యాస్టింగ్ ఎంపిక ఉండే విధంగా ప్రశాంత్ నీల్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలోమలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించబోతున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.సినిమాలో ప్రభాస్ పని చేసే మాఫియా లీడర్ పాత్రలో మోహన్ లాల్ కనిపిస్తాడని, అతని పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని సమాచారం.

ఇక రానా కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది.ఇందులో స్టోరీ నేరేషన్ అంతా కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతోనే ట్రావెల్ అవుతుందని బోగట్టా.

ఇప్పటికే ప్రశాంత్ మోహన్ లాల్ కి కూడా క్యారెక్టరైజేషన్ గురించి నేరేట్ చేశారని ఆయన కూడా నటించడానికి ఒకే చెప్పారని టాక్ గట్టిగా వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube