ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవనే సంగతి తెలిసిందే.బ్రో, బేబీ సినిమాల హవా తగ్గడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ప్రదర్శితమవుతున్న సినిమాలకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు.
ఈ వారం విడుదల కానున్న సినిమాలతో ఆ లోటు భర్తీ అయ్యే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఆగష్టు నెల 10వ తేదీన రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ ( Jailer )థియేటర్లలో విడుదల కానుంది.
నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో వింటేజ్ రజనీకాంత్ ను చూస్తామని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించారు.
ఈ సినిమాలోని కావాలయ్యా సాంగ్ ఊహించని స్థాయిలో హిట్ అయింది.ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉండగా రజనీ కోరుకున్న సక్సెస్ ఈ సినిమాతో దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.
చిరంజీవి మెహర్ రమేశ్ కాంబినేషన్ లో తెరకెక్కిన భోళా శంకర్( Bhola Shankar ) మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.చిరంజీవి ఈ సినిమాలో స్టైలిష్ గా కనిపిస్తుండగా ఆగష్టు 11వ తేదీన ఈ సినిమా రిలీజవుతోంది.
తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా మహతి స్వరసాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.ఈ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో కీర్తి సురేష్ నటించారు.

సన్నీ దేవోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన గదర్2 ఆగష్టు నెల 11వ తేదీన థియేటర్లలో విడుదలవుతోంది.అక్షయ్ కుమార్ ఓ మై గాడ్2 సినిమా కూడా ఆగష్టు నెల 11న థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ సినిమాలతో పాటు శ్రీ సింహా, కావ్య కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఉస్తాద్ మూవీ ఆగష్టు నెల 12వ తేదీన రిలీజ్ కానుంది.ఓటీటీలలో రిలీజ్ కానున్న సినిమాల విషయానికి వస్తే నెట్ ఫ్లిక్స్ లో ఆగష్టు 7న గబ్బీస్ డాల్ హౌస్ మూవీ స్ట్రీమింగ్ కానుండగా ఆగష్టు 8వ తేదీన జాంబీవెర్స్ కొరియన్ వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది.

ఆగష్టు 11న హార్ట్ ఆఫ్ స్టోన్, ఇన్ అనదర్ వరల్డ్ విత్ మై స్మార్ట్ ఫోన్, పెండింగ్ ట్రైన్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.జీ5 యాప్ లో ది కశ్మీర్ ఫైల్స్ అన్ రిపోర్టెడ్, అబర్ ప్రోలీ ఆగష్టు 11న స్ట్రీమింగ్ కానున్నాయని సమాచారం.ఆహాలో హిడింబ తెలుగు వెర్షన్( Hidimba ) ఆగష్టు 10న స్ట్రీమ్ కానుండగా అమెజాన్ ప్రైమ్ లో ఆగష్టు 10వ తేదీన మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.సోనీ లివ్ లో ఆగష్టు 9న ది జంగబూరు కర్స్ స్ట్రీమింగ్ కానుండగా పొర్ తొళిల్(తమిళ్, తెలుగు) ఆగష్టు 11వ తేదీన స్ట్రీమింగ్ కానుంది.







