తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి.ఆదివారంతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్న క్రమంలో శనివారం సభలో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ ఇంకా ప్రతిపక్ష నేత చంద్రబాబులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు.తెలంగాణ అభివృద్ధి గురించి కేటీఆర్ విపక్షాలకు కౌంటర్లు ఇస్తూ మాట్లాడుతూ… పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు మరియు జగన్ కి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి అర్థమయింది.
కానీ రాష్ట్రంలో విపక్షాలకు అర్థం కావడం లేదంటూ మండిపడ్డారు.
అసెంబ్లీలో పల్లె పట్టణ ప్రగతి పై చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించడం జరిగింది.ఈ క్రమంలో హైదరాబాద్ అభివృద్ధిని మరియు భూముల విలువను చంద్రబాబు గుర్తించారు.తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 100 ఎకరాలు కొనొచ్చు అని వ్యాఖ్యానించారు.
ఈ రకంగా తెలంగాణలో చంద్రబాబు జరుగుతున్న అభివృద్ధిని గుర్తించినందుకు ధన్యవాదాలు.ఇదే సమయంలో తెలంగాణలో శాంతిభద్రతలను ఏపీ సీఎం జగన్ మెచ్చుకున్నారు.
దిశా ఘటన విషయంలో ఐ సెల్యూట్ టూ కేసీఆర్ అని జగన్ అభినందించడం జరిగింది.తెలంగాణలో శాంతిభద్రతలను మెచ్చుకున్న జగన్ కు ధన్యవాదాలు.
జగన్.చంద్రబాబుకు అర్ధమైన విషయాలు రాష్ట్రంలో విపక్షాలకు అర్థం కాకపోవడం దురదృష్టకరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.