ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ( Telugu film industry )కనీవిని ఎరగని రీతిలో భారీ గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి ప్రభాస్ కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.వరుసగా బాహుబలి, సాహో ( Baahubali, Saaho )లాంటి సినిమాలతో విజయాలను అందుకున్న ఆయన సలార్, కల్కి సినిమాలతో భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.

ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న ఫౌజీ, స్పిరిట్( Fauzi, spirit ) లాంటి సినిమాలతో మొత్తం మరోసారి తనకంటూ ఒక ఐడిటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత సలార్ 2 సినిమాని పట్టలెక్కించే పనుల్లో బిజీగా ఉన్నాడు.మరి ఈ సినిమాలతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.సలార్ మొదటి పార్ట్ లో ప్రభాస్ కి అంతా ఇంపార్టెన్స్ లేదని చాలా విమర్శలు అయితే వచ్చాయి.

దానికి తగ్గట్టుగానే ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్ లో ఆయన విశ్వరూపాన్ని చూపించబోతున్నాను అంటూ రీసెంట్ గా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ ని సంపాదించడానికి ముందు వరుసలో దూసుకెళ్తున్నాడనే చెప్పాలి.బాలీవుడ్ హీరోలకి చెమటలు పట్టించిన మొదటి తెలుగు హీరో కూడా ప్రభాస్ గారే కావడం విశేషం.ప్రస్తుతం అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి ఖాన్ త్రయానికి సైతం చెమటలు పట్టిస్తున్న హీరో ప్రభాస్ అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి రాబోయే సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…