టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ ( Ram Charan )ఇటీవల గేమ్ చేంజర్ మూవీతో( game changer movie ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది.
దీంతో చెర్రీ తన తదుపరి సినిమాతో ఎలా అయినా సక్సెస్ను అందుకోవాలని చూస్తున్నారు.రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
క్రికెట్, కుస్తీ నేపథ్యంలో సాగే సినిమా ఇది.ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ( Janhvi Kapoor )నటిస్తున్న విషయం తెలిసిందే.ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ సినిమా పూర్తి అయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్.

రంగస్థలం సినిమా తర్వాత చెర్రీ సుకుమార్ కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతుండడంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.దానికి తగ్గట్టుగానే స్క్రిప్టు విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకొంటున్నాడు సుకుమార్( Sukumar ).త్వరలోనే సుక్కు విదేశాలకు వెళ్లబోతున్నాడని, తన టీమ్ తో అక్కడే స్క్రిప్టు పూర్తి చేస్తారని తెలుస్తోంది.ఈలోగా హీరోయిన్, ఇతర నటీ నటులు, సాంకేతిక నిపుణులు ఎవరైతే బాగుంటారన్న విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఈసారి చరణ్ పక్కన రష్మికని ఖరారు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయట.

ఇప్పటివరకు చెర్రీ రష్మిక ( Rashmika )కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు.ఈ జోడి చాలా ఫ్రెష్ గా ఉంటుందని దానికి తోడు రష్మిక ఈ మధ్యకాలంలో నటించిన సినిమాలన్నీ వరుసగా హిట్ అవుతుండడంతో తప్పకుండా ఈ జోడి సక్సెస్ అయ్యి సినిమా కూడా సక్సెస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.పైగా పుష్ప, పుష్ప 2లలో శ్రీవల్లీగా రష్మిక గుర్తుండిపోయే నటన కనబరిచింది.
ఈ సినిమాలతో రష్మికపై సుకుమార్ నమ్మకం కూడా మరింత బలపడింది.సాధారణంగా తన సినిమాల్లో హీరోయిన్స్ ని రిపీట్ చేయడం సుకుమార్ కి ఇష్టం ఉండదు.
కానీ చరణ్ సినిమాతో రష్మికని కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడట.ప్రస్తుతానికైతే ఈ కాంబో చర్చల దశలోనే ఉంది.
బుచ్చిబాబు సినిమా పూర్తయ్యేసరికి కనీసం ఏడాది సమయం పడుతుంది.ఈలోగా లెక్కలు మారవచ్చు.