ప్రస్తుత రోజులలో ఊరుకు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా వారి పనులలో బిజీ బిజీగా ఉన్నారు.చాలా మంది ఆఫీసులో వెళ్లే క్రమంలో మెట్రో ట్రైన్, బస్సులు, ఆటోలు, కారులు ఇలా తదితర వాహనాలతో వారి ఆఫీసులకు వెళ్లి విధులు నిర్వహిస్తూ అంటారు.
ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలలో మెట్రో రైలులో అతి తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోవడానికి కోసం ఎక్కువ శాతం మంది మెట్రో రైల్ లలో( Metro Trains ) ప్రయాణాలు చేస్తూ ఉంటారు.

అయితే, నేడు (సోమవారం) హైదరాబాద్ నగరంలో( Hyderabad ) మెట్రో రైలు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి.సాంకేతిక లోపం( Technical Issue ) కారణంగా రైలు ఆగిపోయినట్లు మెట్రో అధికారులు తెలిపారు.హైదరాబాద్ సిటీలోనే నాగోల్ నుండి రాయదుర్గం రూటు, అలాగే ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్లే రూటు మార్గంలో మెట్రో రైలు ఏక్కడికక్కడే నిలిచిపోయాయని మెట్రో అథారిటీ వాళ్లు తెలియజేశారు.
లాంగ్ వీకెండ్ అనంతరం సోమవారం ఉదయం సహజంగా మెట్రో రైలు చాలా ఎక్కువగా రద్దీగా ఉంటుంది.అలాంటి సమయంలో నేడు ఇలా రైలు సర్వీసులు బ్రేక్ డౌన్ అవ్వడంతో అన్ని మెట్రో స్టేషన్ లలో ప్రయాణికులు అనేక ఇబ్బంది పడ్డారు.

ప్రస్తుతం ఇలా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతున్నాయి.నేడు ఉదయం 10 గంటల నుంచి సాంకేతిక లోపం కారణంగా.అన్ని రూట్స్ లో ఒక్కసారిగా ఎక్కడికక్కడే ఉన్న మెట్రో రైళ్లు అక్కడే ఆగిపోయాయి.ఇందుకు సంబంధించి.సాంకేతిక లోపం ఏర్పడిందని త్వరలోనే యదావిధిగా మెట్రో రైళ్లు ప్రయాణం జరుగుతుందని మెట్రో యాజమాన్యం తెలిపింది.కాకపోతే లోపానికి గల కారణం ఏమి అనేది తెలపలేదు.
దాదాపు 15 నిమిషాల తర్వాత మెట్రోలు యదావిధిగా నడిచాయి.
.






