మీ కోరికలన్నీ తీరాలని అనుకుంటున్నారా? అయితే అక్షయ తృతీయ రోజు ఇలా చేయండి..

సాధారణంగా హిందూ సాంప్రదాయంలో కొన్ని రకాల పూజలకు ప్రత్యేకమైన ఫలితాలు లభిస్తాయి.అలాగే అక్షయ తృతీయ రోజు కూడా పూజ చేస్తే చాలా ఫలితాలు ఉంటాయి.

 Do You Want All Your Wishes To Come True? But Do This On Akshaya Tritiya , Lord-TeluguStop.com

సాధారణంగా అక్షయ తృతీయ( Akshaya Tritiya ) రోజు కాస్తయినా బంగారం కొనాలనీ దానివల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని ప్రతి ఒక్కరు కూడా అపోహ పడుతుంటారు.అయితే అక్షయ తృతీయ రోజు కేవలం బంగారం కొనడం వల్ల మాత్రమే మంచి జరగదు.

ఎందుకంటే ఆ లక్ష్మీదేవి ప్రసన్నం కావడానికి, మన కోరికలు తీరడానికి లక్ష్మి, కుబేర పూజలు చాలా సహాయపడతాయని వేద పండితులు చెబుతున్నారు.

అయితే చాలామంది ఎంత కష్టపడినా వారు అనుకున్న పనులు జరగవు.

దీంతో వారు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు.అలాంటి వారికి అక్షయ తృతీయ రోజున ఇలా చేస్తే తమకి లక్ష్మీదేవి అలాగే కుబేర అనుగ్రహం కలిగి ఉంటుంది.

దీంతో వారు అనుకున్న ప్రతి పని కూడా సకాలంలో జరుగుతాయి.ఇక వారి ఇంట్లో ధన ప్రవాహం కూడా కలుగుతుంది.

అయితే అక్షయ తృతీయ రోజు ఆ పూజలు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Akshaya Tritiya, Devotional, Ganpati Pooja, Kalasam, Lakshmi Devi, Lord K

అక్షయ తృతీయ రోజు చేసే పూజకు కావాల్సిన వస్తువులు:

లక్ష్మీదేవి అలాగే కుబేరుడు( Lord kubera ) చిత్రా దేవి సమేతంగా ఉన్న పఠము, ఒక ప్లేట్, రెండు రూపాయల నాణేలు, ఒక లక్ష్మీకాసు, తాంబూలం, పంచామృతం, పండ్లు, పూలు, నైవేద్యం కొరకు పాయసం, దద్దోజనం, కలశం.

పాటించాల్సిన నియమాలు:

Telugu Akshaya Tritiya, Devotional, Ganpati Pooja, Kalasam, Lakshmi Devi, Lord K

ఇక ఈ పూజలో పెట్టే దీపాన్ని ఒక రోజంతా కొండేక్కకుండా చూసుకోవాలి.అలాగే ఉపవాస దీక్షలు కూడా చేయాలి.పూజ ముందు అలాగే తర్వాత రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలి.

పూజ చేయాల్సిన విధానం:

అయితే అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే నిద్ర లేచి తమ ఇల్లు, వాకిలిని శుభ్రం చేసుకోవాలి.ఆ తర్వాత తలస్నానం చేసి పూజ గదిలో పసుపుతో అలకాలి.ఇక దానిపై కుబేర ముగ్గు వేసి పసుపు, కుంకుమలు ఉంచాలి.అంతేకాకుండా కుబేర ముగ్గుపై పీఠం వేసి ముందు చెప్పిన పటమును ఉంచాలి.దానిపై పసుపు, కుంకుమ పూలను పెట్టాలి.

ఇక ఆ పఠము ముందు కూడా కలశం ఉంచాలి.ఇక ఆ తర్వాత ఒక ఆకు తీసుకొని పసుపు గణపతి చేసుకొని ఆ పీఠము పైన ఉంచాలి.

ఆ తర్వాత ఒక ప్లేట్లో, లక్ష్మీకాసు, కుబేరుడు చిత్రావతి ప్రతిరూపంగా రూపాయి నాణేలు ఉంచి పూజించాలి.ఇక మనకున్న కోరికలు అనుకుంటూ నెరవేరుతుందనే సంకల్పంతో కంకణం కట్టుకోవాలి.

ముందుగా గణపతి పూజ( Ganpati Pooja ) మొదలుపెట్టి ఆ తర్వాత షోడచపోచార పూజ, లక్ష్మీ అష్టోత్తరపూజ, కుబేర మంత్రాలు జపించాలి.అలాగే నైవేద్యాలు సమర్పించాలి.

ఇలా చేస్తే లక్ష్మి, కుబేర అనుగ్రహం కలిగి మనం కోరుకున్న కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube