అమ్మవారి ప్రసాదం లో అపచారం...మండిపడుతున్న భక్తులు

బాసర సరస్వతి అమ్మవారి ఆలయం ఎంత ప్రసిద్దో అందరికీ తెలిసిందే.నిర్మల్ జిల్లా లోని బాసర అమ్మవారి ని దర్శించుకోవడం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు అక్కడకి విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు.

 Insect Found In Basara Ammavaari Laddu Prasadam-TeluguStop.com

అంతేకాకుండా చిన్నారులకు చాలా మంది బాసర సరస్వతి ఆలయం లోనే అక్షరాభాస్య కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు.ఎప్పుడు నిత్యం భక్తులతో ఆ ఆలయం కిట కిటలాడుతూ ఉంటుంది.

అయితే ఆ ఆలయంలో అమ్మవారి ప్రసాదం గా ఇచ్చిన లడ్డూ లో పురుగు కనిపించడం స్తానికంగా భక్తులు ఆందోళన చెందుతున్నారు.అమ్మవారి ప్రసాదాన్ని ఎంతో భక్తి శ్రద్ద లతో ఆరగించే భక్తులకు ఈ విధంగా ప్రసాదం లో పురుగు రావడం తో వారు అవాక్కయ్యారు.

అమ్మవారి ప్రసాదాన్ని భక్తులు ఏమాత్రం ఆలోచించకుండా కళ్లకు అద్దుకొని మరి స్వీకరిస్తూ ఉంటారు.అలాంటిది భక్తుల ప్రసాదం విషయం అధికారులు కనబరుస్తున్న తీరుపై భక్తులు మండిపడుతున్నారు.

భక్తులకు ఇచ్చే ప్రసాదం విషయంలో అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యం చూపడం భక్తులను కలవరపాటుకు గురిచేస్తుంది.ఈ విధంగా దేవాలయాలలో ప్రసాదాల్లో ఎదో ఒక అపచారం అనేది జరుగుతూనే ఉంది.

-General-Telugu

గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రసాదం లో కూడా అపచారం జరిగిన సంగతి తెలిసిందే.అయితే అనంతరం అధికారులు అప్రమత్తమై దేవాలయం ప్రసాద విషయంలో ఎలాంటి అపచారం దొర్లకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.ఇప్పుడు బాసర అమ్మవారి ప్రసాదం లో కూడా ఈ విధంగా అపచారం జరగడం తో స్థానికులు అధికారుల నిర్లక్ష్య ధోరణి పై మండిపడుతున్నారు.మరి దీనిపై ఆలయ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube