1 మిలియన్ క్లబ్ లో సీతారామం చేరుతుందా.. స్పీడ్ చూస్తే తగ్గేలా లేదుగా!

గత జులై నెలలో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అనేవే పడలేదు.వచ్చిన సినిమా వచ్చినట్టు ప్లాప్ అవుతూ వచ్చాయి.

 Dulquer Salmaan's Sita Ramam Takes Us Box Office By Storm , Us Box Office, Dulqu-TeluguStop.com

దీంతో ఆగష్టు నెలలో రిలీజ్ అయ్యే సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూసారు.ఇక ఎట్టకేలకు ఆగష్టు ఫస్ట్ వారంలో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

రెండు సినిమాలు కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకులను మెప్పించడంతో కలెక్షన్స్ మోత మోగిపోతుంది.

చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్స్ పడే సరికి టాలీవుడ్ కి కొత్త కళ వచ్చింది.

మరి ఫస్ట్ వారంలో రిలీజ్ అయినా సినిమాల్లో సీతా రామం ఒకటి.హ్యాండ్సమ్ హీరోగా పేరు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ హీరోగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన సినిమా సీతా రామం.

యుద్ధం నేపథ్యంలో అందమైన ప్రేమ కథను మరింత ఎమోషనల్ గా తెరకెక్కించాడు డైరెక్టర్.ఈ సినిమా రిలీజ్ ముందు అంత అంచనాలు లేకపోయినా రిలీజ్ తర్వాత మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

దీంతో ఈ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.ఇండియా లోనే కాదు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తుంది.

Telugu Ashwini Dutt, Dulquer Salmaan, Dulquersalmaans, Mrunal Thakur, Sita Ramam

యూఎస్ మార్కెట్ లో ఏకంగా 9 లక్షల 25 వేల డాలర్స్ మార్క్ దాటి ఇప్పుడు 1 మిలియన్ మార్క్ కోసం ట్రై చేస్తుంది.ఈ సినిమా క్రేజ్ చూస్తుంటే ఈ సినిమా ఈజీగా 1 మిలియన్ మార్క్ టచ్ చేసేలాగానే ఉంది.చూడాలి మరి ఈ సినిమా ఎన్ని రోజులకు 1 మిలియన్ మార్క్ టచ్ చేస్తుందో.ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ నిర్మించారు.

రష్మిక మందన్న కూడా కీలక పాత్రలో నటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube